lockdown: కుమార్తె వివాహానికి తండ్రే పురోహితుడు

సాధారణంగా పురోహితుల సొంతింట్లో వివాహాది శభకార్యాలంటే ఇతర బ్రాహ్మణులు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన పెళ్లికి మాత్రం వధువు తండ్రే పురోహితుడిగా మారారు....

Published : 25 May 2021 00:17 IST

రాయచూర్: సాధారణంగా పురోహితుల సొంతింట్లో వివాహాది శభకార్యాలంటే ఇతర బ్రాహ్మణులు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన పెళ్లికి మాత్రం వధువు తండ్రే పురోహితుడిగా మారారు. రాయచూర్ జిల్లా సింధనూరు తాలుకాలోని పోథ్నాల్ గ్రామంలో మల్లయ్యస్వామి తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కర్ణాటకలో లాక్ డౌన్ విధించిన కారణంగా పెళ్లికి బయటి పురోహితులెవ్వరూ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో వధువు తండ్రే పురోహితుడిగా వ్యవహరించారు. ఆచార, సంప్రదాయాలతో స్వయంగా తానే దగ్గరుండి ఆయన కుమార్తెతో ఏడు అడుగులు వేయించారు. ఇదే సమయంలో తన కూతురితో  పాటు బంధువుల కూమార్తె వివాహాన్నీ కూడా అదే ముహూర్తానికి జరిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని