తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై ఐటీశాఖ ప్రకటన

తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది.

Updated : 13 Feb 2020 21:31 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు, దిల్లీ, పుణె సహా 40 చోట్ల జరిపిన సోదాలపై ఆదాయపన్ను (ఐటీ)శాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఆ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖపట్నం, దిల్లీ, పుణె నగరాల్లో దాడులు జరిపామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయిని.. మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లెక్క చూపని రూ.85లక్షల నగదు, రూ.71లక్షల విలువైన ఆభరణాలు తమ సోదాల్లో లభ్యమైందని తెలిపింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపామని ఐటీశాఖ వెల్లడించింది. బోగస్‌ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు ద్వారా భారీగా నగదు చలామణి చేస్తున్నట్లు గుర్తించామని ఐటీ శాఖ వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని