జిరాఫీతో ఫొటోషూట్‌.. హమ్మయ్య అనుకున్న జంట

ప్రతి ఒక్కరికీ వివాహం అనేది ఒక మధుర ఘట్టం. అందుకే దాన్ని ఎప్పటికీ మరుపురాని తీపి జ్ఞాపకంగా మలుచుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిందే వెడ్డింగ్‌ ‘ఫొటోషూట్‌’. తమ ఫొటోషూట్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని,

Published : 13 Mar 2020 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి ఒక్కరికీ వివాహం అనేది ఒక మధుర ఘట్టం. అందుకే దాన్ని ఎప్పటికీ మరుపురాని తీపి జ్ఞాపకంగా మలుచుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిందే వెడ్డింగ్‌ ‘ఫొటోషూట్‌’. తమ ఫొటోషూట్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలని, అందరికంటే భిన్నంగా ఉండాలని తహతహలాడుతుంటుంది ఆ కొత్తజంట. అందుకోసం వినూత్నంగా ఆలోచిస్తోంది. ఈక్రమంలో ఓ నూతన జంట జూపార్క్‌ను తమ ఫొటోషూట్‌కు వేదికగా ఎంచుకుంది. ఈ సందర్భంగా ఒక జిరాఫీ వారికి ఓ మంచి జ్ఞాపకాన్ని మిగిల్చింది.

భారత్‌కు చెందిన అమిశ్‌, మేఘన ఇటీవల వివాహం చేసుకున్నారు. ఫొటోషూట్‌ కోసమని కాలిఫోర్నియాలోని ఓ జూపార్క్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న ఓ జిరాఫీ ఎన్‌క్లోజర్‌ వద్ద ఫొటోల కోసం స్టిల్స్‌ ఇస్తున్నారు. ఈక్రమంలో వెనకాలే నిల్చొని ఉన్న ఆ జిరాఫీ వరుడి తలపై ఉన్న పాగాను నోటితో తీసుకుంది. గమనించిన వధువు దాన్ని పట్టిలాగినా ఆ జిరాఫీ ససేమిరా విడిచిపెట్టలేదు. ఇంతలోనే ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి వచ్చి జిరాఫీ నుంచి తలపాగాను బలంగా లాగేసుకున్నాడు. దీంతో.. ‘తలపాగా దక్కింది.. కొంచెం ఉండుంటే జిరాఫీకి ఆహారమయ్యేది.. హమ్మయ్య’ అనుకున్నారు. చివరకు.. ‘జిరాఫీతో మా ఫొటో షూట్‌ విజయవంతంగా పూర్తయింది’ అని ఆ జంట ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని