విమానంలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించిన వేళ ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ తేలుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా చెన్నై నుంచి సేలంకు ట్రూజెట్ విమానంలో ప్రయాణించిన ఆరుగురికి కరోనా పాజిటివ్..

Published : 28 May 2020 23:45 IST

చెన్నై: దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించిన వేళ ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ తేలుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా చెన్నై నుంచి సేలంకు ట్రూజెట్ విమానంలో ప్రయాణించిన ఆరుగురికి కరోనా పాజిటివ్ తేలింది. మొత్తం 56 మంది ఆ విమానంలో ప్రయాణించారు. అయితే, విమానం ఎక్కే ముందు వీరికి చేసిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వారితో పాటు ప్రయాణించిన వారందరినీ క్వారంటైన్లో ఉంచినట్టుగా అధికారులు తెలిపారు. ఆ ఆరుగురిలో ఒకరు చెన్నైలోని స్టాన్లీ వైద్యకళాశాలలో పనిచేస్తున్న ఒక అధ్యాపక వైద్యుడు ఉండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని