సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవ్‌: ఈటల

టిమ్స్‌లో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌పై ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు

Published : 28 Jun 2020 01:02 IST

హైదరాబాద్‌: టిమ్స్‌లో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌పై ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ల్యాబ్‌ల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన కమిటీ విస్తృత పరిశీలన చేస్తుందన్నారు. కొన్ని ల్యాబ్‌ల్లో 70శాతం నమూనాలు పాజిటివ్‌ అని రావడం అనుమానం కలిగిస్తోందన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రైవేటు ల్యాబ్‌లు ఇచ్చిన ఫలితాల్లో నిజానిజాలను కమిటీ తేల్చుతుందని చెప్పారు. ఈ మేరకు పలు ల్యాబ్‌లకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. లోపాలు సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ అవకతవకలకు పాల్పడిన ల్యాబ్‌లను మంత్రి హెచ్చరించారు.  సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా ఇంటింటికీ కరోనా సర్వే చేస్తామని చెప్పారు. జంటనగరాల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడంపై చర్చించారు.  ప్రజలు కింగ్‌ కోఠి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రి, చెస్ట్‌ ఆస్పత్రి, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి - కొండాపూర్‌, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని