Green Tea: ఉదయాన్నే గ్రీన్‌ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!

తెల్లారగానే తేనీటిని తాగకపోతే మనసంతా అదోలా ఉంటుంది. కాఫీ, టీ ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే హాయిగా ఉంటుందని భావిస్తాం. వీటికి బదులుగా ఉదయం గ్రీన్‌ టీని తాగారనుకోండి..ఆ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Published : 21 Aug 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెల్లారగానే తేనీటిని తాగకపోతే మనసంతా అదోలా ఉంటుంది. కాఫీ, టీ ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే హాయిగా ఉంటుందని భావిస్తాం. వీటికి బదులుగా ఉదయం గ్రీన్‌ టీని తాగారనుకోండి..ఆ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఎలాంటివో పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అంజలీదేవి తెలిపారు.

☕ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఇష్టంగా తాగే పానీయం టీ. ఇది ఎన్నో రుచుల్లో లభ్యం అవుతోంది.

☕ ఈ టీలలో గ్రీన్‌ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి.

☕ ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు మళ్లిన వారు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు.

☕ మధుమేహులు, అధిక రక్తపోటున్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

☕ క్యాన్సర్‌ సెల్స్‌ ఎక్కువగా పెరగకుండా చూస్తుంది. క్యాన్సర్‌ తొలి దశలో ఉన్న ప్రతి రోజు గ్రీన్‌ టీని తాగడంతో ఫలితం ఉంటుంది.

☕ ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు ఉన్నవారికి మేలు చేస్తుంది. వాకింగ్‌ వెళ్లి వచ్చిన తర్వాత తాగితే మరీ మంచిది.

☕ ఇందులో ఎలాంటి విష, అనారోగ్య కారకాలు అసలే లేవు. చిన్నా పెద్దా తేడా లేకుండా తాగొచ్చు.

☕ గ్రీన్‌ టీ లో మెండుగా ఉండే రెసిపెరిట్రాల్‌ పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది.

☕ శరీరంలోని కొవ్వులను కరిగించే శక్తి ఉన్నట్టు తేలింది. స్థూలకాయంతో బాధపడేవాళ్లు వ్యాయామంతో పాటు గ్రీన్‌ టీ తాగితే బాగుంటుంది.

☕ తీవ్రమైన మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. ఏ సమయంలోనైనా ఈ టీని తాగొచ్చు. 

☕ శరీరానికి మంచిదని అతి తాగొద్దు. నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. గ్రీన్‌ టీ పొడిగా కంటే ఆకులుగా ఉంటేనే మంచిదని గుర్తుంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని