TS High Court: జగన్‌ అక్రమాస్తుల కేసులపై హరిరామ జోగయ్య పిల్‌.. విచారణ 3నెలలు వాయిదా

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

Published : 15 Dec 2023 16:26 IST

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్‌ కేసులపై విచారణ పూర్తి చేయాలని పిటిషనర్‌ కోరారు. ఇప్పటికే 20 కేసుల్లో డిశ్చార్జ్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి సంబంధించి జగన్‌, సీబీఐకి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదు. నవంబరు 8న విచారణ సందర్భంగా జగన్‌, సీబీఐకి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటి వరకు నోటీసులు జారీ కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.  ప్రజా ప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో సుమోటో పిల్‌గా ప్రజా ప్రతినిధుల కేసులను హైకోర్టు విచారిస్తోంది. సుమోటో పిల్‌తో కలిపి జగన్‌ కేసుల పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు 3 నెలలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని