Karate Kalyani: ఆ ఉద్దేశంతోనే దత్తత తీసుకున్నానని చెప్పా: కరాటే కల్యాణి

సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) చిన్నారి దత్తత వివాదంపై మరోసారి స్పందించింది.

Published : 18 May 2022 01:45 IST

హైదరాబాద్‌: చిన్నారి దత్తత వివాదంపై సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) మరోసారి స్పందించారు. తనపై ఆరోపణలు రావడంతో విచారణ నిమిత్తం సీడబ్ల్యూసీ కార్యాలయానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. నేడు అక్కడి అధికారులు లేకపోవడంతో విచారణకు బుధవారం మళ్లీ హాజరవనున్నట్టు తెలిపారు. కలెక్టర్‌, సీడబ్ల్యూసీ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. కలెక్టర్‌ను కలిసి దత్తత వ్యవహారంపై వివరణ ఇచ్చినట్టు తెలిపారు. 5 నెలల చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని, కానీ దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడింది నిజమేనని వివరించారు. పలువురు తనను స్ఫూర్తిగా తీసుకుంటారనే ఉద్దేశంతో అలా చెప్పినట్టు పేర్కొన్నారు. తనను కేసులో ఇరికించేందుకు కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ దగ్గర పాపను నేను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ 1098 నంబర్‌కు ఫిర్యాదురాగా సంబంధిత అధికారులు కల్యాణి కుటుంబ సభ్యులను ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాను అన్యాయాన్ని సహించనని.. అందుకే చాలామంది ఆరోపణలు చేస్తున్నారంటూ కల్యాణి సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని