Volunteers: ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు

ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్‌ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సర్క్యులర్‌ జారీ చేసింది. 

Updated : 27 Mar 2024 18:14 IST

అమరావతి: ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్‌ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సర్క్యులర్‌ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్‌ పత్రం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి..  సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. పింఛను పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని పేర్కొన్నారు. పంపిణీ చేసినట్టుగా ఫొటోలు, వీడియోలు తీయవద్దని సెర్ప్‌ తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని