ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లేఖ

మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి.

Published : 02 May 2024 18:27 IST

అమరావతి: మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. గత ఆరు నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు లేఖ రాశాయి. మే 4 నుంచి నగదు రహిత చికిత్సలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని