Andhra news: బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్‌

మే నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1945 కోట్లు విడుదల చేసిందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌ తెలిపారు.

Published : 02 May 2024 22:41 IST

అమరావతి: మే నెల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,945 కోట్లు విడుదల చేసిందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం 65,49,864 మంది పింఛనుదారులకు గానూ 63,31,470 మందికి పంపిణీ పూర్తయ్యిందన్నారు. 15,13,752 మందికి ఇంటింటికీ వెళ్లి ఇవ్వగా.. మరో 48,17,718 మందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. 74,399 మంది బ్యాంకు ఖాతాలకు మొబైల్‌ అనుసంధానం కాకపోవడం వల్ల డబ్బులు జమ చేయడం సాధ్యకాలేదన్నారు. వీరందరికీ మే 4న ఇంటింటికీ  వెళ్లి పింఛను అందిస్తామని శశిభూషణ్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని