Telangana News: రెయిన్‌ అలర్ట్‌.. తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 16:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ఈరోజు తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని