Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు లోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
బెంగళూరు: సినీనటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC Paper Leak: నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు: హైకోర్టులో నిందితుడి భార్య పిటిషన్
-
General News
AP ICET: ఏపీ ఐసెట్ దరఖాస్తులు ప్రారంభం.. రెండు షిఫ్టుల్లో పరీక్ష!
-
Politics News
Revanth reddy: పేపర్ లీకేజీ కేసు.. సిట్ నోటీసులకు భయపడేది లేదు: రేవంత్‌రెడ్డి
-
Politics News
Chandrababu: ఇది ఆరంభమే.. వచ్చే సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు
-
General News
TSRJC CET: టీఎస్ఆర్జేసీ సెట్‌కు దరఖాస్తు చేశారా? మార్చి 31 లాస్ట్!
-
India News
Modi-Kishida: భారత పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!