Hakimpet: స్పోర్ట్స్‌ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్‌ ఎత్తివేత

హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Published : 19 Feb 2024 16:29 IST

హైదరాబాద్‌: శామీర్‌పేట్ మండలం హకీంపేటలోని (Hakimpet) స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను సస్పెండ్‌ చేశారని దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే హరికృష్ణపై సస్పెన్షన్‌ విధించారన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. విచారణ కమిటీ సైతం ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతేడాది ఆగస్టులో హరికృష్ణపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. నిరాధార ఆరోపణలతో సస్పెండ్‌ చేశారని అప్పట్లో హరికృష్ణ తెలిపారు. తాజాగా సస్పెన్షన్‌ ఎత్తివేయాలన్న కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన స్పందించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని