AP News: అమరావతి రైతుల పిటిషన్‌పై హైకోర్టులో రేపు విచారణ

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు

Updated : 14 Dec 2021 12:42 IST

అమరావతి: తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ చేపట్టనుంది.

మరోవైపు మహాపాదయాత్రలో పాల్గొన్న అమరావతి రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అనుమతి ఇచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది. రేపు ఒక్కరోజే మొత్తం 500 మంది దర్శనానికి అనుమతి లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని