AP Floods: చెయ్యేరు నదిలో గుర్తు తెలియని మృతదేహాలు

కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల నందలూరు మండలంలోని మర్రిపల్లి

Updated : 23 Dec 2021 22:01 IST

నందలూరు(కడప): కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల నందలూరు మండలంలోని మర్రిపల్లి వద్ద చెయ్యేరులో గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. నిన్న  అన్నమయ్య జలాశయం రక్షణ గోడ తెగిపోయి వరదనీరు చెయ్యేరు పరివాహాక గ్రామాలపై పొంగి ప్రవహించిన విషయం తెలిసిందే. దాంతో పలువురు గల్లంతయ్యారు. వారిలో కొందరి మృతదేహాలు నిన్ననే లభ్యమయ్యాయి. ఈ క్రమంలో మర్రిపల్లి వద్ద గుర్తించిన మృతదేహాలు నిన్న ప్రవాహాంలో కొట్టుకుపోయినవారివే అయి ఉండొచ్చని అధికారులు, స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను వెలికి తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని