
Updated : 07 Sep 2021 13:55 IST
Floods: జగిత్యాల జిల్లాలో వరదలో చిక్కుకొని తండ్రీకుమారుడు గల్లంతు
గొల్లపల్లి: జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో గొల్లపల్లి మండలం మల్లన్నపేట వాగులో చిక్కుకొని నందిపల్లికి చెందిన తండ్రీకుమారుడు గల్లంతయ్యారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టగా.. బాలుడు విష్ణు మృతదేహం లభ్యమైంది. చిన్నారి తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :