Ts News: 70 శాతం సిలబస్‌తో ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు: ఇంటర్‌ బోర్డు

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు....

Updated : 12 Oct 2021 18:41 IST

హైదరాబాద్: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామన్నారు. నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ను tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జలీల్‌ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. రెండో సంవత్సరంలో కాలేజీ మారిన విద్యార్థులు... మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని జలీల్‌ తెలిపారు. విద్యార్థుల కెరీర్, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని జలీల్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని