TS High Court: దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ వాయిదా

భారాస నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వీరు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Published : 05 Jan 2024 14:39 IST

హైదరాబాద్‌: భారాస నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వీరు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్‌ 171 ప్రకారం కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆపడానికి వీల్లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆర్టికల్‌ 361 ప్రకారం పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషన్‌ విచారణార్హతను తేలుస్తామన్న సీజే ధర్మాసనం.. విచారణను జనవరి 23కు వాయిదా వేసింది. కాగా, దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ గత జూలైలో అప్పటి మంత్రిమండలి తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని