Top 10 news 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 26 Mar 2024 17:05 IST

1. కాంగ్రెస్‌ వంద రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం: రేవంత్‌రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

2. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తాం: చంద్రబాబు

జగన్‌ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్‌ కేలండర్‌ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా.. ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

3. భాజపాను కట్టడి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు: కేటీఆర్‌

భారాస పాలనలో హైదరాబాద్‌లో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస, భాజపా ఒక్కటేనంటూ అసత్య ప్రచారం చేసి, మైనార్టీ సోదరులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దిల్లీ మద్యం కేసులో ఆధారాలుంటే కిషన్‌రెడ్డి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

4. కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన అమెరికా

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. దీనిపై తాజాగా అమెరికా నుంచి స్పందన వచ్చింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

5. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి: రఘునందన్‌రావు

 ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని భాజపా నేత, మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

6. ట్రంప్‌నకు మళ్లీమళ్లీ రాని రోజు.. ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కాలం ఒక్కసారిగా కలిసొచ్చింది. ఆయనకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. అదే సమయంలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్‌ ఒకటి పూర్తయింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

7. కాంగ్రెస్‌లోకి వరుణ్‌ గాంధీ? ఆఫర్‌ ఇచ్చిన హస్తం పార్టీ

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి సొంత పార్టీపైనే విమర్శలు చేసి ఇటీవల వార్తల్లో నిలిచారు భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ. దీని ఫలితంగానే ఇటీవల పార్టీ ఆయనకు టికెట్‌ నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్‌ స్థానంలో ఈసారి జితిన్‌ ప్రసాదను నిలబెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

8. ఐపీఎల్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు.. రూట్‌లు ఇవే..

క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ - ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు భారీగా ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

9. ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ ప్లాన్లు ఇవే..

ఒక వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లను పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ మేరకు ప్రకటన రావొచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిఛార్జ్‌ మరింత భారం కాకముందే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటే మేలు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

10. నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్‌..నదిలో పడిన కార్లు..!

అమెరికాలో అనూహ్య ఘటన జరిగింది. నౌక ఢీకొనడంతో బాల్టిమోర్ నగరంలో ఏకంగా ఒక బ్రిడ్జ్‌ కూలిపోయింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘నౌక ఢీకొనడంతో ఫ్రాన్సిస్‌ స్కాట్ కీ బ్రిడ్జ్‌ కూలిపోయింది’ అని ఎక్స్‌లో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని