Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Mar 2024 17:11 IST

1. కుప్పంలో లక్ష మెజార్టీయే మన టార్గెట్‌: చంద్రబాబు

దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెదేపా అధినేత చంద్రబాబు  అన్నారు. తెదేపా కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం

2. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. నేరం అంగీకరించిన నిందితులు!

ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు మంగళవారం కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతోపాటు, ప్రధాన నిందితుడు ప్రణీత్‌రావును కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. పూర్తి కథనం

3. తాగునీరు అనవసర వాడకం.. 22 కుటుంబాలకు జరిమానా

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసుల్ని తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. ఈనేపథ్యంలో నీటిని పొదుపు చేసేందుకు అధికారులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. అనవసర పనులకు తాగునీరు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నీటి వృథాపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు. పూర్తి కథనం

4. సజ్జలను తొలగించండి.. ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైకాపా కార్యకర్తలా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పూర్తి కథనం

5. ‘నోరు’ జారి.. ‘అవకాశం’ కోల్పోయి!

 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోన్న భాజపా.. ప్రత్యర్థులకు తమ అభ్యర్థులపై విమర్శలు గుప్పించే అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడుతోంది. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్నవారిని పోటీ నుంచి తప్పిస్తోంది. పూర్తి కథనం

6. లాకప్‌లో కంప్యూటర్‌, పేపర్‌ ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌ ఆదేశాలు ఎలా జారీ చేశారు..!

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేశారంటూ దిల్లీ మంత్రి ఆతిశీ మార్లీనా నిన్న విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం ప్రదర్శించారు. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. పూర్తి కథనం

7. దిల్లీలో మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లను నమ్ముకొన్న భాజపా

సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని ఎన్నికల ప్రచారం చేయడంలో భాజపా చాలా ముందుంటుంది. ఈసారి ఆ పార్టీ దిల్లీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఓ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. పార్టీలోని మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకొంది. వీరికి క్షేత్రస్థాయిలో ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉంటాయని పార్టీ బలంగా నమ్ముతోంది. పూర్తి కథనం

8. సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచులు ముగిశాయి. విజేతలుగా నిలిచిన జట్ల సొంత మైదానాల్లోనే ఇవి జరగడం విశేషం. ఇవాళ బెంగళూరు - పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. హోమ్‌ గ్రౌండ్‌లో విక్టరీ ఆనవాయితీని బెంగళూరు కొనసాగిస్తుందో.. లేదో చూడాలి! పూర్తి కథనం

9. కీ చైన్‌తో పేమెంట్స్‌.. ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి ఫ్లాష్‌ పే

ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఫ్లాష్‌ పే పేరుతో రూపే స్మార్ట్‌ కీ చైన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ కీ చైన్‌తో కాంటాక్ట్‌ లెస్‌ చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతం క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల్లో ఉన్న ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌ తరహాలోనే ఇదీ పని చేస్తుంది. అంటే ఈ చిన్న కీ చైన్‌ మీవెంట ఉంటే సులువుగా పేమెంట్స్‌ చేయొచ్చు. పూర్తి కథనం

10. నియంతపై బామ్మ పోరు.. అధ్యక్ష ఎన్నికల్లో 80ఏళ్ల సామాన్యురాలి పోటీ

దక్షిణ అమెరికాలోని వెనిజువెలా దేశంలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్‌ మదురో అధికార పార్టీ తరఫున మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఈసారి ప్రతిపక్షం తరఫున కొరీనా యారిస్‌ బరిలోకి దిగారు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని