Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 08 Jun 2023 09:04 IST

1. పాలు లేకుండా కోవా.. పాలపొడి, మురికినీళ్లు, రవ్వ కలిపి తయారీ

పాలకోవా చూడగానే ఎవరికైనా నోరూరాల్సిందే. మొఘల్‌పురలోని దేశీ డెయిరీలో కోవా తయారీ తీరు చూస్తే మాత్రం వాంతులు తప్పవు. అంతటి దుర్గంధం, వ్యర్థాలు, అపరిశుభ్రత మధ్య కోవా తయారుచేస్తున్నారు. అది కూడా.. పాలు లేకుండానే. దేశీ డెయిరీలో తయారయ్యే ఈ అనారోగ్యకర పాలకోవాను నిర్వాహకులు నగరమంతా సరఫరా చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడులతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. పెంచుడేనా.. పంచుడేదీ..!

భూముల మార్కెట్‌ విలువను ఎప్పటికప్పుడు సవరిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర సర్కారు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు.. అదే సమయంలో భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా స్థానిక సంస్థలకు సమకూరాల్చిన నిధులను విదల్చకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది. ఇప్పటికే పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకుంది. ఇతర మార్గాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను కూడా అడ్డుకోవడంతో గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే పడకేశాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. దొంగ బంగారం దర్జాగా వ్యాపారం!

ధర పెరిగినా.. తగ్గినా వన్నె తరగని గొప్పతనం పసిడి సొంతం. ఇందు కోసమే దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్‌ చేసుకొని పలు ముఠాలు చైన్‌ స్నాచింగ్‌లకు తెగబడుతున్నాయి. నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఏటా రూ.100 కోట్ల విలువైన సొత్తు మాయమవుతోంది. దీనిలో 80 శాతం ఆభరణాలే ఉంటాయి. ఇంతటి డిమాండ్‌ ఉన్న బంగారం నగరంలోకి భారీగా స్మగ్లింగ్‌ అవుతోంది. కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేసేందుకూ ముందుకు రావడం లేదని నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయ్‌..!

వాల్తేరు డివిజన్‌లో విశాఖ రైల్వేస్టేషన్‌ పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. 8 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.. కాని స్టేషన్‌కు ఉన్న ప్రతిబంధకం కారణంగా ఇక్కడికొచ్చిన ప్రతి రైలు తిరిగి వెనక్కి వెళ్లాలి. దీని కోసం ఇంజిన్‌ మార్చాల్సి రావడంతో 20నిమిషాల వరకు ప్లాట్‌ఫామ్‌పై ఉండాల్సిన పరిస్థితి. ఫలితంగా మరిన్ని రైళ్లు విశాఖ స్టేషన్‌కు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. చేసేందుకా.. మేసేందుకా?.. ఎమ్మెల్యేలు చెబితే సరి

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జలవనరుల శాఖలో నిర్వహణ పనుల తీరు అక్రమాలకు నిలయంగా మారింది. అసలు పనులు జరుగుతున్నాయో లేదో తెలియడం లేదు. ఉద్యోగులు, విద్యార్థుల హాజరు సైతం బయోమెట్రిక్‌, ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా నమోదు చేస్తుంటే.. జలవనరుల శాఖలో అసలు చేసిన పనులకు ఎంబీలు(కొలతల పుస్తకం) మినహా ఎలాంటి ఆధారాలు లేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ఒకటే వంతెన.. ఎక్కాలంటే యాతన

ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం.. అంటూ రైల్వే శాఖ అన్ని స్టేషన్లలో భారీగా ప్రచారం చేస్తున్నా ఆచరణలో శూన్యమని చెప్పడానికి నిదర్శనం పలుచోట్ల ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటడమే. కాకినాడ జిల్లాలోని సామర్లకోట జంక్షన్‌ రైల్వేపరంగా ప్రధాన జంక్షన్‌. రోజూ ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ నగరాలకు 60 రైళ్లు పరుగులు తీస్తుంటాయి. వాటిలో దాదాపు 20 వేల మంది వరకు ఈ స్టేషన్‌ నుంచే వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. రుచి చూసేద్దామా!

ఫిష్‌ ఫ్రై.. ప్రాన్‌ బిర్యానీ.. ఫిష్‌ పకోడి.. ప్రాన్‌ పకోడి.. ఫిష్‌ కట్‌లెట్స్‌.. ఫిష్‌ ఫింగర్‌.. అపోలో ఫిష్‌.. చదివితేనే నోరూరుతుంది కదూ.. వీటితో పాటు మరెన్నో చేపల వంటకాలు రుచి చూసేందుకు వీలుగా ప్రభుత్వం మూడు రోజుల పాటు ఫిష్‌ ఫుడ్‌ పెస్టివల్‌ నిర్వహిస్తోంది.. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు(జూన్‌ 8, 9, 10) చేపల ఆహార దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే

ప్రపంచ వ్యాప్తంగా 2022లో జారీ చేసిన ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే దక్కిందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ తెలిపారు. అది భారత్‌ జనాభాను ప్రపంచ జనాభాతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఏడో విద్యార్థి వీసా దినోత్సవం సందర్భంగా దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయిలలోని కాన్సులేట్‌లలో 4500 విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. బీసీలకు బాసట.. ఎందరికి ఊరట?

బీసీలకు వ్యక్తిగత రుణాల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న యువత ఉన్నపళంగా అర్జీలు పెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధికి బాటలు వేసేందుకు రుణాలివ్వాలని తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల సంఖ్య నాలుగు జిల్లాల పరిధిలో పెరగబోతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. బాబోయ్‌.. ఇదేం బాదుడు..!

అది సంతబొమ్మాళి మండలంలోని తీర గ్రామమైన మలగాం. వేట సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుటుంబాలే అక్కడన్నీ.. రెండు బల్బులు, ఒక ఫ్యాను మాత్రమే సగటున వినియోగిస్తున్నారు. ప్రతినెలా రూ.వందల్లోనే కరెంట్‌ బిల్లు వచ్చేది. కానీ మేనెల బిల్లు రూ.వేలల్లో రావడం చూసిన వారికి పగలే చుక్కలు కనిపించాయి. ఇదేం దారుణమంటూ  అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబానికి రూ.20 వేలు, డాబా, రేకులు ఇళ్లలో ఉన్నవారికి రూ.40 వేలు వరకు బిల్లులు వేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని