Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 13 Jun 2023 09:00 IST

1. ట్రాఫిక్‌ చిక్కులు.. ఛార్జింగ్‌కు తిప్పలు

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల శక్తినంతటినీ ఈ రద్దీ పీల్చేస్తోంది. విద్యుత్‌ స్కూటీలు, కార్లు, బస్సులు ఇలా ప్రతి ఒక్క వాహనంలో ఈ సమస్య ఏర్పడుతోంది. ఛార్జింగ్‌ చేసిన అనంతరం ఎక్కువ దూరం ప్రయాణిస్తే తిరుగు ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోతున్న సందర్భాలున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీసీని సైతం ఈ సమస్య వెంటాడుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఇంటర్‌లో...ఏ గ్రూపు ఎవరికి?

పదో తరగతి తర్వాత ఉన్నత విద్య దిశగా అడుగులేయడానికి ఇంటర్మీడియట్‌ కోర్సులు దారి చూపుతాయి. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, టీచింగ్‌, లా, ఫార్మా, మేనేజ్‌మెంట్‌... ఇలా ఏ వృత్తిలోకి వెళ్లాలన్నా ఇంటర్‌ కూడలి లాంటిది. విద్యార్థులు ఏ రంగంలో ఉన్నత విద్య ఆశిస్తున్నారో నిర్ణయించుకుని, తమ ఆసక్తి, ప్రావీణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్‌లో గ్రూపు ఎంచుకోవాలి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ‘భద్రకాళిపై భూబకాసురుల కన్ను’

భూబకాసురుల నుంచి భద్రకాళి చెరువును రక్షించాలని, ఫుల్‌ ట్యాంకు లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలాల్లో మట్టి నింపుతుంటే హనుమకొండ జిల్లా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు గూండాల పహారాలో 24 గంటలూ  మట్టి నింపుతున్నారన్నారు. సోమవారం హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో ఆక్రమణకు గురవుతున్న భద్రకాళి చెరువు స్థలాలను కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. కోతలు.. వాతలు..!

గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.. విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిపోతుంది. ఎమెర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో కాకుండా సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. నగర ప్రాంతంలో సరఫరాకు ఇబ్బందుల్లే కున్నా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు. సమయపాలన లేకుండా రాత్రిళ్లు కూడా విద్యుత్తు కోతలు అమలు చేయడంతో పల్లెవాసులకు కంటి మీద కునుకు కరవవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. ఖమ్మం గుమ్మంలో రాజకీయ వేఢీ

శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో తలమునకలవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికవుతోంది. భాజపా, కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖమ్మం దారి పడుతుండటం, వామపక్ష పార్టీలు సైతం ఇక్కడి నుంచే ఎన్నికల క్షేత్రంలోకి దిగేలా కార్యాచరణ రూపొందించుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. నిఘా లేని ఘాట్‌!

దూర ప్రాంత వాహనదారులకు తిరుమల ఘాట్‌రోడ్లపై అవగాహనలేమి.. కాలం చెల్లిన ట్యాక్సీల అతివేగం.. నిష్ణాతులైన చోదకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల తిరుపతి- తిరుమల ఘాట్‌రోడ్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సొంత వాహనదారులకు చోదక అనుమతులు (డీఎల్‌) ఉన్నప్పటికీ ఘాట్‌రోడ్డుపై అవగాహనలేక డివైడర్‌ను ఢీ కొడుతున్నారు. ఘాట్‌ ప్రమాద ఘటనలపై నిత్యం నిఘా పెట్టాల్సిన రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ఐదేళ్లుగా తిరుమల ఎంవీఐ అధికారి లేకపోవడంతో నిఘా కొరవడింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. కాసుల గొలుసులు

జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం దాటి అదనంగా రూ.148 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తద్వారా బీరు, బ్రాంది అమ్మకాల్లో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.
భిక్కనూరు మండలం జంగంపల్లిలోని బెల్ట్‌ దుకాణాన్ని నిర్వాహకులు రూ.19.85 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ తతంగం అంతా ఆబ్కారీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరిగినట్లు నిర్ధారణ అయింది. ఇదే తీరున జిల్లాలోని పలు గ్రామాల్లో గొలుసు దుకాణాలకు అధికారికంగానే వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. నీళ్లు వదిలాక కాలువ పనులా?

కాలువలకు నీటి విడుదల చేయని సమయంలో సహజంగా పూడిక తీయడం, మరమ్మతు పనులు చేపడతారు. ఇందుకు విరుద్ధంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత పనులకు టెండర్లు పిలవడం గమనార్హం. నీటి ప్రవాహంలో పనులు ఏ మేరకు చేస్తారోనన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. జలవనరులశాఖ ఇంజినీర్లు ముందస్తుగా ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేయడంతో ఈపరిస్థితి ఏర్పడింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందా? ఇలా చేయండి మరి!

ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్‌ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ ఇదే తీరు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా ఎవరికైనా మీటర్‌ మీదనే సందేహం వస్తుంది. విద్యుత్తు సంస్థకు నిర్ణీత రుసుం చెల్లించి మీటర్‌ను తనిఖీ చేయిస్తే లోపాలుంటే పాత మీటర్‌ స్థానంలో కొత్తవి బిగిస్తారు. మరి మీటర్‌ బాగానే ఉందని టెస్టింగ్‌లో తేలితే? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. బండ్లపల్లి యువతి.. అంతర్జాతీయ ఖ్యాతి

నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బి.అనూష అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆమె బౌలింగ్‌ చేస్తే బంతి గింగిరాలు తిరిగి వికెట్‌ను ముద్దాడుతుంది. బ్యాటింగ్‌ చేస్తే పరుగుల వరద పారాల్సిందే. ఇక ఫీల్డింగ్‌ విషయానికొస్తే మైదానంలో పాదరసంలా కదిలి బంతిని బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మురిపిస్తున్న 19 ఏళ్ల ఈ గ్రామీణ యువతి అంతర్జాతీయ పోటీలకు తొలిసారిగా ఎంపికైంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని