Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 15 Jun 2023 08:57 IST

1. మేటి ఉపాధికి డిప్లొమా మార్గం!

హైదరాబాద్: పదో తరగతి తర్వాత.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ... కోర్సులు చదవాలనుందా? అయితే పాలిటెక్నిక్‌ డిప్లొమాలో చేరిపోండి. ఇప్పుడీ కోర్సులు ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలూ పొందవచ్చు లేదా స్వయం ఉపాధి, ఉన్నత విద్యలోనూ రాణించవచ్చు. అభిరుచి, ఆసక్తి ప్రకారం ఎంచుకోవడానికి పదుల సంఖ్యలో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. హైటెక్‌సిటీలో అరకు కాఫీ ఘుమఘుమ

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హబ్‌ అరబికా పేరిట హైటెక్‌సిటీలో అరకు వ్యాలీ ఉత్పత్తుల స్టోర్‌ ఆరంభమైంది. రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్‌ను ఏపీ గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభ స్వాతిరాణి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకు ప్రాంత గిరిజనులు తయారు చేసిన సేంద్రియ ఉత్పత్తులను గిరిజన కో ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా సేకరించి వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ప్రియురాలి ఫిర్యాదుతో..పీటలపై ఆగిన పెళ్లి!

కొన్ని నిమిషాల్లో పచ్చని  పందిరిలో పెళ్లి జరగాల్సి ఉంది.. ఇంతలో వరుడి అసలు నిజస్వరూపం తెలిసింది. పోలీసుల రంగ ప్రవేశంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం బోధన్‌పల్లి గ్రామానికి చెందిన ఏటకారి సాయి(27) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా చనువుగా తిరిగి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ప్రాణాలకు లేదు పూచీ!

బెజవాడలో కాలినకడకన రోడ్డెక్కితే ప్రాణాలకు పూచీ లేకుండా పోతోంది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై నడుద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది. పాదచారుల కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య ప్రాంతాల్లో అయితే ఇది ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా పాదచారులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. సెప్టెంబరులోపు విమానాశ్రయ మెట్రో పనులు

విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు పనులను సెప్టెంబర్‌ నాటికి ప్రారంభించాలని, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎఎంఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. బుధవారం బేగంపేట్‌లోని మెట్రో రైల్‌ భవన్‌లో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించగా పాల్గొన్న బిడ్డర్లకు ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. జగనన్నకు చెప్పినా.. నిరాశే!

‘మీ సమస్య పరిష్కారం.. మాకు ప్రాధాన్యతాంశం’ అంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 1902కు ఫోన్‌ చేస్తే తమ సమస్య పరిష్కారమైందని, సంతృప్తిగా ఉన్నామని చెప్పేవారి సంఖ్య జిల్లాలో తక్కువగా ఉంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాలు మొదలుకుని వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పి సకాలంలో పరిష్కారాన్ని పొందవచ్చని సర్కారు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. పట్నం నుంచి పల్లెదాకా..

జిల్లాలో గంజాయి ఘాటెక్కుతోంది. నగరం, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. యువత విచ్చలవిడిలా వినియోగిస్తూ మత్తులో నిండా మునుగుతోంది. సిరులు కురిపిస్తున్న ఈ దందాలో అనేక మంది భాగస్వాములవుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో రూ.లక్షల విలువ చేసే సరకు పట్టుబడి, కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ విక్రేతలు వెనక్కి తగ్గడం లేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. పేరుకే ప్రెసిడెంటు! పైసా రాదు.. పెత్తనం లేదు!

ప్రెసిడెంట్‌ (సర్పంచి) అనే పిలుపునకు గ్రామాల్లో ఒకప్పుడు చాలా విలువ ఉండేది. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులైనా వారికి అంతటి ప్రాధాన్యతనిచ్చేవారు. కుటిల రాజకీయాలు తెరపైకి వచ్చాక ఆ పదవికున్న విలువ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దిగజారిందని సర్పంచుల ఛాంబర్‌ జిల్లా అధ్యక్షుడు కడలి గోపాలరావు వాపోయారు. గ్రామాల్లో చిన్న చిన్న పనులకు కూడా నోరెళ్ల్లబెట్టాల్సి వస్తోందని ఎవరేం అడుగుతారోనని సమాధానం చెప్పలేక సర్పంచులు పంచాయతీలకు రావడమే తగ్గించేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మా.. నేనే భారమవుతున్నానా!

ఏ తల్లయినా కన్నబిడ్డను ఇతరులకు అమ్ముకోవాలనుకోదు. పుట్టిన బిడ్డను పారేయాలనుకోదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణంగా అటువైపు అడుగులు వేయిస్తుండటం ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన మహిళకు ఆడబిడ్డ పుట్టిన రెండోరోజునే అమ్మేసింది. దీన్ని అధికారులు గమనించి నిలువరించారు. ఏదో ఒక ప్రాంతంలో శిశు విక్రయాల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. ప్రముఖుల పుస్తకంలో రాచర్ల వాసికి చోటు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..మన్‌కీబాత్‌లో గుర్తించిన ప్రముఖుల వంద మంది చిత్రాలతో విడుదల చేసిన పుస్తకంలో రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.రాంభూపాల్‌రెడ్డికి చోటు దక్కింది. గత రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన మొత్తం పోస్టాఫీసు లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసి ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒక సారి పంచాయతీ లోని 100 మంది పేద బాలికల విద్య కోసం సుకన్య యోజన పథకంలో బాలికల అకౌంట్లలో జమ చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని