logo

హైటెక్‌సిటీలో అరకు కాఫీ ఘుమఘుమ

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హబ్‌ అరబికా పేరిట హైటెక్‌సిటీలో అరకు వ్యాలీ ఉత్పత్తుల స్టోర్‌ ఆరంభమైంది.

Updated : 15 Jun 2023 06:23 IST

తెలంగాణలో తొలి స్టోర్‌ ప్రారంభం

స్టోర్‌ను ప్రారంభిస్తున్న గిరిజన కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, చిత్రంలో సురేష్‌బాబు, సెల్వరాజ్‌, రాంప్రసాద్‌ తదితరులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హబ్‌ అరబికా పేరిట హైటెక్‌సిటీలో అరకు వ్యాలీ ఉత్పత్తుల స్టోర్‌ ఆరంభమైంది. రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్‌ను ఏపీ గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభ స్వాతిరాణి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకు ప్రాంత గిరిజనులు తయారు చేసిన సేంద్రియ ఉత్పత్తులను గిరిజన కో ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా సేకరించి వాటికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో తొలి అరకు వ్యాలీ కాఫీ స్టోర్‌ను రాయదుర్గం మెట్రోస్టేషన్‌ వద్ద ప్రారంభించినట్లు చెప్పారు. ఈ స్టోర్‌లో అరకు ఆర్గానిక్‌ కాఫీతో పాటు వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. గిరిజనులు సేకరించిన తేనెతో పాటు, నూనెలు, షాంపూలు, సీకాయ పొడి, సబ్బులు, త్రిఫల రసం వంటి ఉత్పత్తులు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో గిరిజన కో ఆపరేటివ్‌ సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ సురేష్‌బాబు, రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, జీఎం యుస్టస్‌, సినీదర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, జబర్దస్త్‌ నటుడు  ఆటో రాంప్రసాద్‌, బుల్లితెర నటుడు సెల్వరాజ్‌, ఏపీ ఆధ్యాత్మిక పర్యాటక ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు