Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 18 May 2023 08:59 IST

1.  Hyd Airport Metro: విమానాశ్రయ మెట్రోకు 9 స్టేషన్లు.. ఎక్కడెక్కడంటే?

రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గంలో మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. టెండర్‌ ప్రక్రియ మొదలు కావడంతో 9 స్టేషన్లను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు (హెచ్‌ఏఎంఎల్‌) సంస్థ ఖరారు చేసింది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్‌రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ పట్టణం, విమానాశ్రయంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)కు కొద్దిదూరంలో, విమానాశ్రయం టెర్మినల్‌లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగుస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తుది సన్నద్ధత ఇదీ!

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ మే 28న జరుగనుంది. పరీక్ష ఎలా ఉంటుందోననే విషయంలో అభ్యర్థులకు ఉత్కంఠ, కొంత బెరుకు ఉండటం సహజమే. ఇప్పటివరకూ కొనసాగుతున్న సన్నద్ధతకు ‘తుది అంకం’ లాంటి చివరి ఈ పది రోజులు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో చేసే పునశ్చరణ (రివిజన్‌) జయాపజయాలను నిర్ణయించగలదు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆధార్‌తో సులభంగా కేవైసీ

బీమా పాలసీల జారీ సందర్భంగా ఆధార్‌ ఉపయోగించి ‘మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ)’ నిబంధనలను సులభంగా పూర్తి చేసేందుకు వీలుగా నిబంధనలు రూపొందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. ప్రస్తుతం బీమా సంస్థలు తమ పాలసీదారులను గుర్తించేందుకు యూఐడీఏఐ అనుమతినిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మంగళగిరి వైకాపాలో అంతర్యుద్ధం!

రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న వేళ ఆయన వైరివర్గం నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆళ్ల లేని సమయంలో ఆయన వ్యతిరేకవర్గానికి చెందిన దొంతిరెడ్డి వేమారెడ్డికి తాడేపల్లి, మంగళగిరి నగర అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతో ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇక పాలమూరుకు విశాఖ- కాచిగూడ రైలు

విశాఖపట్నం నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న రోజువారి ఎక్స్‌ప్రెస్‌ రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తున్నారు. ఈ రైలును పొడిగించాలంటూ చాలా రోజులుగా ప్రయాణికులు రైల్వే అధికారులు కేంద్ర మంత్రులు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు ఈ రైలును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 20న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇక్కడి రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యాప్‌.. బెట్టింగ్‌ గప్‌చుప్‌!

ఉమ్మడి జిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు, జూదాల సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. భీమవరం కేంద్రంగా కథ నడుపుతున్న బుకీలు పోలీసులకు చిక్కకుండా నూతన సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు. గత నెల రోజులుగా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు బుకీలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రధాన బుకీలు దేశంలోని పలు పట్టణాలను కేంద్రంగా చేసుకుని వ్యాపారం చక్కబెడుతున్నారు. వీటి నిర్వహణకు ఇతర పట్టణ, గ్రామస్థాయిల్లో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అడ్డగోలు బిల్లులు

కొండగట్టులో ఏటా నిర్వహించే ఆంజనేయస్వామి జయంత్యుత్సవాల్లో లక్షల్లో బిల్లులు చెల్లించడం, గుత్తేదార్లకు అధిక రేట్లకు పలు పనులు అప్పగించడం ఆరోపణలకు దారితీస్తోంది. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏప్రిల్‌ 6, మే 14న నిర్వహించిన హనుమాన్‌ జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అధికారులు దాదాపు కోటి రూపాయలు వెచ్చించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Virat Kohli: బెంగళూరుకు చావోరేవో.. కోహ్లీపైనే అందరి దృష్టి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ ముగిసింది. ఐపీఎల్‌-16లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆ జట్టు.. మిగతా జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అందులో మొదటగా సొంతగడ్డపై గురువారం బెంగళూరును ఢీకొననుంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యావశ్యకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విదేశీయుల ఆపసోపాలు

మయన్మార్‌ దేశానికి చెందిన సాంస్కృతిక ప్రతినిధులు ఆరుగురు విశాఖ సందర్శనకు వచ్చారు. ఈ నెల 15 నుంచి ఇక్కడి పలు ప్రాచీన, సందర్శనీయ ప్రాంతాలను వీక్షించారు. పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. భీమిలిలోని పురాతన చర్చి, డచ్‌ సమాధులు, ఫ్లాగ్‌ ఆఫీసర్ల సమాధులు, దీపస్తంభం, తొట్లకొండ చూశారు. అశోకుడి కాలం నాటి చారిత్రక వివరాలు తెలుసుకోవాలనే ఆశతో మంగళవారం భీమిలి పరిధిలోని పావురాలకొండ సందర్శనకు వెళ్లి ఆపసోపాలు పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమ్మో.. వాడేశారు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రత గరిష్ఠంగా వివిధ ప్రాంతాల్లో 40-47డిగ్రీల సెంటిగ్రేడ్‌లకు చేరుకోవడంతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది.. గత వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఉక్కపోతకు తాళలేక చల్లదనం కోసం ప్రతి ఒక్కరు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పెద్దఎత్తున వినియోగిస్తున్నారు.. ఫలితంగా విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ (ఉమ్మడి చిత్తూరు జిల్లా) పరిధిలో విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని