Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 24 May 2023 09:01 IST

1. MS Dhoni: తొందరేల.. ఆ తలనొప్పి ఇప్పుడే ఎందుకు?: రిటైర్‌మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్లోకి చెన్నైసూపర్‌ కింగ్స్‌ (CSK) అడుగు పెట్టింది. క్వాలిఫయర్‌ -1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మరీ ఘనంగా తుదిపోరుకు (GT vs CSK) చేరింది. దీంతో 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన సీఎస్‌కేను కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అద్భుతంగా ముందుకు నడిపించి టైటిల్‌ రేసులో నిలిపాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Online Bus Ticket: బస్సు ఆలస్యమైతే టికెట్‌ సొమ్ము వాపస్‌

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుకింగ్‌ సేవలను అందించే అభిబస్‌ తన ప్రచారకర్తగా సినీ నటుడు మహేశ్‌ బాబును కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఇక్సిగో గ్రూపు అనుబంధ సంస్థ అయిన అభిబస్‌ కొత్తగా పలు సేవలనూ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. మంగళవారం ఇక్కడ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మంది బస్‌ ఆపరేటర్లతో కలిసి అభిఅస్యూర్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. Hyderabad-ORR: ఓఆర్‌ఆర్‌పైకి రాకపోకలు ఇక సులువు

మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న ఓఆర్‌ఆర్‌పైకి రాకపోకలు మరింత సులువుగా మార్చేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. నార్సింగి వద్ద నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ పనులు చివరికి దశకు చేరుకున్నాయి. 10 రోజుల్లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఇంటర్‌ఛేంజ్‌ నుంచి అవుటర్‌పైకి వాహనాలు సులువుగా చేరడానికి, అవుటర్‌ నుంచి కిందికి దిగడానికి ఉపయోపడనుంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. బందరు రావయ్యా.. ఏదో ఒక బటన్‌ నొక్కవయ్యా..!

‘మన జిల్లాలో మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది. ఒక్కసారి బందరు రావయ్యా.. ఇక్కడికి వచ్చి ఆటోవాళ్లకో, మత్స్యకారులకో... విద్యాదీవెనో.. ఏదో ఒక బటన్‌ నొక్కవయ్యా..! అని జగన్‌ను పిలిచాను. ఆయన రాలేదు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ బందరు ఓడరేవు పనులు చేపడతానని.. అప్పుడే వస్తానన్నాడు..! ఇప్పుడు బందరు వచ్చాడు’... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. కునుకు పట్టదు.. వణుకు వీడదు

రయ్‌... రయ్‌ మంటూ దూసుకొచ్చే కార్లు.. అడుగడుగునా పోలీసుల తనిఖీలు.. అధికార పార్టీ నేతల అరుపులతో నగరంలోని గాయత్రి ఎస్టేట్‌ వాసులకు నిద్ర కరవైంది. ప్రశాంత వాతావరణలో ఉంటే ఆ కాలనీ వాసులు భయంభయంతో గడుపుతున్నారు. కనీసం ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసే పరిస్థితి కరవైంది. ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులొచ్చారు.. అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వైకాపా నేతలు ఆసుపత్రి ఎదుట తిష్ట వేశారు. అప్పటి నుంచి కాలనీ వాసులు భయపడిపోతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. జగనన్న కాలనీల జగడం

అనకాపల్లి జిల్లా గృహనిర్మాణ సంస్థలో అధికారుల పనితీరు బాగోలేదు.. మునగపాక మండలంలో జగనన్న కాలనీల కోసం తెచ్చిన సిమెంట్‌, ఇనుము అక్కడి వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ అమ్మేసుకున్నారు.. ఆయన అక్రమాలు తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.. అనకాపల్లి మండలంలో ఒక సహాయక ఇంజినీరు రూ.10 వేలు తీసుకుని ఇళ్లు మంజూరు చేశారు.. ఆ శాఖలో దిగువస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అవినీతికి పాల్పడుతున్నారు’ అని మునగపాక జడ్పీటీసీ సభ్యుడు, అనకాపల్లి ఎంపీపీ ఆరోపించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. వట్టి మాటలే.. కడుపు కోతలే..

కడుపు కోతలు(శస్త్రచికిత్సలు)తగ్గించడంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమవుతోంది. సర్కారుతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది. మంత్రులు, అధికారులు సాధారణ కాన్పులపై శ్రద్ధ పెడుతున్నామని చెబుతున్నా అవన్నీ వట్టిమాటలే అవుతున్నాయి. కాన్పులన్నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే జరగాలంటూ పదే పదే మంత్రి ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడి అధికారులు పెడచెవిన పెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. నాడు విన్నారు...ఆనక వదిలేశారు

సుదీర్ఘ కాలంగా రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించిన చాగల్లు జైపూర్‌ చక్కెర కర్మాగారం చాలాకాలం క్రితం మూతపడింది. రైతులకు సుమారు రూ.32 కోట్ల బకాయిలు యాజమాన్యం చెల్లించింది. తమ ఉపాధి, మిగిలిన బకాయిల కోసం కార్మికులు అలు పెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్నికల ముందు (2019లో) నియోజకవర్గానికి వచ్చిన జగన్‌కు అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థిని, నేటి హోంశాఖా మంత్రి తానేటి వనిత, స్థానిక నాయకులతో కలిసి ఇబ్బందులను వివరించారు. ఇప్పటికీ అక్కడి పరిస్థితిలో మార్పులేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. El Nino: ఎల్‌నినో కథ

ఎల్‌నినో. పసిఫిక్‌ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగొచ్చని అమెరికాకు చెందిన డార్ట్‌మౌత్‌ కాలేజ్‌ తాజా అధ్యయనం హెచ్చరిస్తుండటమే దీనికి కారణం.ఇంతకీ ఎల్‌నినో అంటే ఏంటి? ఎందుకొస్తుంది? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. అధికార పార్టీనా..అయితే వదిలేయ్‌!

సోమవారం మధ్యాహ్నం.. తెలంగాణ నుంచి మాచర్ల వైపు వస్తున్న కారు రెంటచింతల వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడినట్లు తెలిసింది. ఈ కారు మాచర్ల పట్టణానికి చెందిన వైకాపా నేతకు చెందింది. కారు బోల్తా పడిన కొద్దిసేపటికే కొందరు వచ్చి కారు తీసుకెళ్లిపోవడంతో పాటు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో తెలంగాణ మద్యం ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని