Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 May 2024 17:00 IST

1. కేంద్రానికి ఆర్‌బీఐ ‘డబుల్‌’ బొనాంజా.. డివిడెండ్‌ కింద ₹2.11 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.11 లక్షల కోట్లు డివిడెండ్‌గా (dividend payout) చెల్లించేందుకు నిర్ణయించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈమేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు. పూర్తి కథనం

2. కోహ్లీ భద్రతకు ముప్పు వల్లే.. బెంగళూరు ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు..!

ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరుకు వేళైంది. లీగ్‌ రెండో దశ నుంచి గేర్‌ మార్చిన బెంగళూరు నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ (Eliminator Match)లతో రాజస్థాన్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే దీనికి ముందు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌ (Practice Session) ఉండగా బెంగళూరు జట్టు అనూహ్యంగా దాన్ని రద్దు చేసుకుంది.పూర్తి కథనం

3. ‘ప్రత్యేక పాలస్తీనా’ను గుర్తించిన ఐర్లాండ్‌, స్పెయిన్‌, నార్వే

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel Hamas conflict) మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని బలంగా వాదిస్తున్న ఐరోపా దేశాలు.. పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా గుర్తించాయి. ఇటీవల నార్వే ఈ విషయాన్ని వెల్లడించగా.. తాజాగా ఐర్లాండ్‌, స్పెయిన్‌ కూడా ప్రత్యేక పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి కథనం

4. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌కు, రాహుల్‌ ఆప్‌నకు ఓటేస్తారు:రాఘవ్‌ చద్దా

కంటి శస్త్రచికిత్స అనంతరం దిల్లీకి తిరిగొచ్చిన ఆమ్‌ ఆద్మీ (AAP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కాంగ్రెస్‌కు ఓటేస్తారని, రాహుల్‌ గాంధీ  (Rahul Gandhi) ఆప్‌నకు ఓటేస్తారని తెలిపారు.పూర్తి కథనం

5. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు రైతులను మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా అమలు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. సన్న వడ్లకే బోనస్‌ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. పూర్తి కథనం

6. సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. పూర్తి కథనం

7. ‘దేవర’లో అవకాశం నా అదృష్టం.. తన పాత్ర గురించి చెప్పిన జాన్వీ కపూర్‌

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘దేవర’ (Devara Movie). ఈ చిత్రంతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర’లో పాత్ర గురించి మాట్లాడారు.పూర్తి కథనం

8. కళానిధి మారన్‌ vs స్పైస్‌జెట్‌.. మాజీ బాస్‌ నుంచి ₹450 కోట్లు రిఫండ్‌ కోరనున్న ఎయిర్‌వేస్‌

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ.. తన మాజీ ప్రమోటర్‌ అయిన కళానిధి మారన్‌ నుంచి రూ.450 కోట్ల మేర రిఫండ్‌ కోరనుంది. గతంలో మారన్‌కు, ఆయనకు చెందిన కేఏఎల్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.730 కోట్ల మొత్తం నుంచి అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలని అడగనుంది.పూర్తి కథనం

9. రీల్స్ పిచ్చి పీక్స్‌కు.. 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకి..!

స్వల్ప వ్యవధిలోనే సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు వెర్రి చేష్టలు చేస్తుంటారు. రీల్స్‌ మోజులో పడి ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనే స్పృహను మరిచి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా ఓ యువకుడు రీల్స్‌ కోసం ఎత్తైన ప్రదేశం నుంచి చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు.పూర్తి కథనం

10. మోదీకి అమిత్‌షా హింట్‌ ఇస్తున్నారా..?: ‘రిటైర్మెంట్‌’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్‌

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు వయసు మీదపడుతోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ కౌంటర్ ఇచ్చింది. నిజానికి ఆయన మోదీ (Modi)కి సంకేతాలిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ప్రధాని పీఠాన్ని దక్కించుకొనేందుకు ఈ భాజపా నేత ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని