టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Apr 2024 09:10 IST

1. నీవుండే జిల్లాకూ.. నీరివ్వలేదే జగన్‌

జిల్లా అంతటా డెల్టా, సాగర్‌ కాలువలు విస్తరించాయి. రెండు నెలల కిందటి వరకు కాలువల్లో నీరు ప్రవహించింది. ముందస్తు ప్రణాళిక, తగినన్ని నిధులు లేకపోవడంతో చెరువులు నింపుకోలేకపోయారు. వైకాపా ప్రభుత్వం తాగు నీటి చెరువులను నింపడంలో చేసిన నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. పూర్తి కథనం

2. కోడ్‌ కూశాక.. కూత మొదలు

హైదరాబాద్‌ నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం 6 ప్లాట్‌ఫాంలతో పాటు.. రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలో టిక్కెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధమైంది.పూర్తి కథనం

3. బందిపోటు పాలన

ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యేను కాబట్టి ఇసుక.. మంత్రిని కాబట్టి గనుల్ని దోచేస్తాం.. నేను పట్టణాభివృద్ధి మంత్రిని కాబట్టి విశాఖ చుట్టూ ఉన్న భూముల్ని ఆక్రమిస్తా.. వాటిని బంధువులు, డ్రైవర్లు, అటెండర్ల పేరుతో  మార్చుకుంటానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు.పూర్తి కథనం

4. బాప్‌రే.. బంగారం..!

బంగారం.. అన్నివర్గాల ప్రజలకు.. ప్రధానంగా అతివలకు ఇష్టమైన అంశం. నాలుగు డబ్బులు జమైతే కొంతైనా కొనిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు. ఇంట్లో ఆడపిల్లలుంటే ముందు నుంచే కొద్దికొద్దిగానైనా పోగు చేస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేటపుడు నగానట్రా లేకుంటే అసంతృప్తికి గురవుతుంటారు.పూర్తి కథనం

5. వైకాపాకే ఓటేయాలని బెదిరింపు

కాకినాడ సంజయ్‌నగర్‌లోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద సోమవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి అందరూ మద్దతు తెలిపి ఓటేయాలని స్థానిక లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అనుచరుడు ఎన్‌ఎస్‌ రాజు హుకుం జారీ చేశారు.పూర్తి కథనం

6. బెదిరిస్తాం.. కొనిస్తాం

మహిళా పక్షపాతినని ప్రకటించుకునే సీఎం జగన్‌..  మహిళా సాధికారత నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పొదుపు మహిళల కోసమని మార్టులు తెచ్చిన ఆయన అందులో వారితోనే పెట్టుబడి పెట్టించి విక్రయిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. విక్రయాలు జరగకపోవడంతో వారితోనే సరకులు కొనుగోలు చేయిస్తున్నారు. పూర్తి కథనం

7. కార్పొరేట్‌ విద్య అంటే ఇదేనా జగన్‌?

‘పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నాం’ సీఎం జగన్‌ తరచూ చెప్పే మాట. క్షేత్రస్థాయిలో బడుల స్థితి చూస్తే సీఎం మాటల్లో ఎంత డొల్ల తనం ఉందో అర్థం అవుతుంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో నేటికీ పాకల్లో పాఠశాలలు నడుస్తున్నాయి. బడుల బాగుకు ‘నాడు-నేడు’ అంటూ ఊదరగొట్టింది.పూర్తి కథనం

8. అంచనాలకు అందవు.. వ్యూహాలు చిక్కవు

రాజధాని పరిధిలో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా.. చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో జరిగే ప్రతీ ఎన్నికలోనూ విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. గెలుపు అభ్యర్థుల మధ్య దోబూచులాడుతూ.. ఉత్కంఠకు గురి చేస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో మినహా మెజారిటీ విషయంలోనూ ఇదే జరుగుతోంది.పూర్తి కథనం

9. ఉత్తరీయం ఎవరికో?

అందమైన హిమాలయ పర్వత ప్రాంతాలకు ఆలవాలమైన ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ పోరు భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో 5 లోక్‌సభ సీట్లున్నాయి. కుమావ్‌ డివిజన్‌లో 2, గడ్‌వాల్‌ డివిజన్‌లో 3 నియోజకవర్గాలున్నాయి. వీటికి తొలి విడతలోనే ఈనెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది.పూర్తి కథనం

10. ఆ మూడు చోట్ల ఎవరు?

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఇంకా రెండు రోజులే సమయముంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభం కానుంది. శుభ ఘడియలున్నాయని తొలి రెండు రోజుల్లోనే నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకూ కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకా ప్రకటించలేదు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని