logo

వైకాపాకే ఓటేయాలని బెదిరింపు

కాకినాడ సంజయ్‌నగర్‌లోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద సోమవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

Updated : 16 Apr 2024 05:38 IST

వ్యతిరేకించిన లారీ ఓనర్లపై దాడి

సాంబమూర్తినగర్‌(కాకినాడ): కాకినాడ సంజయ్‌నగర్‌లోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద సోమవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల్లో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి అందరూ మద్దతు తెలిపి ఓటేయాలని స్థానిక లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అనుచరుడు ఎన్‌ఎస్‌ రాజు హుకుం జారీ చేశారు. దీనిని కొందరు వ్యతిరేకించగా బెదిరింపులకు పాల్పడటంతో పాటు వారి లారీలకు సీరియల్‌ నంబర్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడ్డారు. దీనిని ప్రశ్నించిన వారిపై దాడికి యత్నించారు. లారీ యూనియన్‌కు సంబంధించిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా వైకాపా కార్యాలయం వద్ద ఉంచి ప్రచారానికి వినియోగించడంతో మరోవర్గం అడ్డు చెప్పింది. కాకినాడకు చెందిన లారీలకు సీరియల్‌  ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కొత్తగా సభ్యత్వం ఇస్తుండటంపై ప్రశ్నించారు. దీనిపై అసహనానికి గురైన రాజు, అనుచరులు నిలదీసిన వారిపై దాడి చేశారు. దాడి చేసిన రాజు వర్గంపై కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత లారీ ఓనర్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని