logo

అంచనాలకు అందవు.. వ్యూహాలు చిక్కవు

రాజధాని పరిధిలో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా.. చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో జరిగే ప్రతీ ఎన్నికలోనూ విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు.

Published : 16 Apr 2024 06:17 IST

చేవెళ్ల, మల్కాజిగిరిలో ఆసక్తికర పోరు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా.. చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో జరిగే ప్రతీ ఎన్నికలోనూ విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. గెలుపు అభ్యర్థుల మధ్య దోబూచులాడుతూ.. ఉత్కంఠకు గురి చేస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో మినహా మెజారిటీ విషయంలోనూ ఇదే జరుగుతోంది.అభ్యర్థులే వ్యూహప్రతివ్యూహాలు  ఎవరికి చిక్కకుండా గెలుపు వాకిట నిలుస్తున్నారు. గత మూడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఇదే విషయం అవగతమవుతోంది. ఈ ఎన్నికల్లోనూ బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. ప్రతీ ఎన్నికలోనూ సుమారు 2 లక్షల మంది కొత్త ఓటర్లు వస్తుండటం, నోటాకు పడుతున్న ఓట్ల సంఖ్య పెరగడం, గుర్తును పోలిన గుర్తులు ఉండటం, పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం ఇవన్నీ కూడా గెలుపు అంచనాలను తలకిందులు చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. గత మూడు ఎన్నికల్లోనూ అభ్యర్థుల మెజారిటీ 0.7 శాతం నుంచి 7 శాతమే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని