Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Apr 2024 09:06 IST

1. సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి

ముఖ్యమంత్రి రోడ్‌షో సాగుతుందని జాతీయ రహదారిని అష్టదిగ్బంధం చేశారు.. వందలాది వాహనదారులకు తీవ్ర అవస్థలు చూపించారు. చీమలదండులా ఎటుచూసినా కదలని వాహనాలతో అత్యవసర పనులపై వివిధ జిల్లాలకు వెళ్లేవారు మాకేంటీ శిక్ష అంటూ విలవిల్లాడారు. పూర్తి కథనం

2. పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం

బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్‌లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. రోజురోజుకీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలుదారులు, విక్రయదారులు, ఆభరణాలు చేసే స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు.పూర్తి కథనం

3. వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి

వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో ఆమె ప్రసంగించారు. ‘‘నగరడోణ జలాశయం ఏర్పాటు కోసం గతంలో రాజశేఖరరెడ్డి ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తే.. దాని పక్కనే జగన్‌ మరోటి వేశారు తప్ప రిజర్వాయర్‌ పూర్తిచేయలేదు.పూర్తి కథనం

4. ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం

రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.పూర్తి కథనం

5. పసివాడిన ప్రాణాలు!

ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం మన రాష్ట్రంలో అంపశయ్యపై అల్లాడుతోంది. సర్కారు ఆసుపత్రుల్లో సేవలు రోజురోజుకు మృగ్యంగా మారుతున్నాయి. తల్లి గర్భం నుంచి అప్పుడే బాహ్య ప్రపంచంలోకి వచ్చిన శిశువులకూ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలూ (ఎస్‌ఎన్‌సీయూ రెగ్యులర్‌-సిక్‌ న్యూబార్న్‌కేర్‌ యూనిట్‌) అసౌకర్యాలకు నెలవుగా మారాయి. పూర్తి కథనం

6. మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం

ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. క్రమంగా ట్రెండు మారుతోంది. సభలు, సమావేశాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంతో పాటు కడుపుబ్బా నవ్వించే వీడియోలు.. వ్యంగ్యంగా రూపొందించిన మీమ్‌లతో ఆకట్టుకోవడం తప్పనిసరిగా మారుతోంది. పూర్తి కథనం

7. మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..

మాట తప్పడం.. మడమ తిప్పడంలో జగన్‌మోహన్‌రెడ్డిది తిరుగులేని రికార్డు. 2019 ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలుపై మాటిచ్చిన ఆయన జనం ఓట్లు వేయించుకుని అధికారంలోకి రాగానే అసలు రూపం బయటపెట్టారు. ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు.పూర్తి కథనం

8. ఉడకని జీడిపప్పు

వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. రాను రాను స్థానికంగా ముడిసరకు దొరకడం కష్టంగా మారడంతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వాటిని దిగుమతి చేసుకుని పప్పు తయారు చేసి విక్రయిస్తున్నారు.పూర్తి కథనం

9. 2026లో ఇండిగో ఎయిర్‌ట్యాక్సీలు

పూర్తి స్థాయి విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను భారత్‌లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఇందుకోసం అమెరికా సంస్థ ఆర్చర్‌ ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌ట్యాక్సీతో దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ప్రకటించింది.పూర్తి కథనం

10. లక్ష్యం @ 60%

రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది. గతమెన్నడూ లేని విధంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, ఏడాదిన్నర కాలంలో ఐదు లక్షలకుపైగా బోగస్‌ ఓట్ల రద్దుతో.. ఈసారి పోలింగ్‌ శాతం పెరగనుందని ఎన్నికల విభాగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని