Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Apr 2024 09:07 IST

1. మౌనమె నీ భాష.. ఓ మూగ మనసా!

వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం కల్యాణ మండపంలో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం నిర్వహించిన ముఖాముఖి సమావేశం అంతా గందరగోళంగా మారింది. నిజానికి ఇందులో ముందే ఎంపిక చేసిన కార్యకర్తలు ఆయన్ను వేనోళ్ల పొగుడుతూ.. ఆకాశానికెత్తేశారు. పూర్తి కథనం

2. ఆన్‌లైన్‌ రుణం.. తీసుకోకున్నా నరకం

లోన్‌యాప్‌ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్‌ల ద్వారా రుణం ఇచ్చి.. రోజుల వ్యవధిలో ఐదారు రెట్లు వసూలు చేయడం, లేకుంటే వేధించేవారు. అసలు రుణం తీసుకోకున్నా ఎంతోకొంత బ్యాంకు ఖాతాలో జమ చేసి తిరిగి వడ్డీతో సహా కట్టాలంటూ ఫోన్లు చేయడం.. అసలు రుణం తీసుకోకున్నా అప్పు తీసుకున్నావంటూ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగుతున్నారు.పూర్తి కథనం

3. జలభగ్నం

ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన జగన్‌ సర్కారు... జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయామని శాసనసభ సాక్షిగా చేతులెత్తేసింది. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పదేపదే చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2024 తర్వాతే పూర్తి చేయగలమని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సర్కారు సమాధానం ఇచ్చింది. పూర్తి కథనం

4. నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి

కొన్నేళ్లుగా వరంగల్‌ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ విమానాశ్రయం ఏర్పాటులో ఉన్న అడ్డంకులు ఏమిటి? సేకరించాల్సిన భూమి ఎంత? ఇందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలా కృషిచేస్తామని చెబుతున్నారు?పూర్తి కథనం

5. నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే

‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి, కౌన్సిలర్‌ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో పరిధిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తన భర్త శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని గెలిపించాలని స్థానికులను కోరారు. ఈసందర్భంగా స్థానిక మహిళ ఒకరు శిల్పా కుటుంబం తనకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పూర్తి కథనం

6. జనాలు తక్కువ.. జెండాలెక్కువ

విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. ఎండ కారణంగా చాలామంది ఆలస్యంగా వచ్చారు. అంతకు ముందు ప్రాంగణమంతా వెలవెలబోయింది. సభ కోసం భారీగా ఆర్టీసీ బస్సులను కేటాయించారు. అవేవీ సకాలంలో చేరుకోలేదు.పూర్తి కథనం

7. కళింగ నేలపై కపట ప్రేమ

వంశధార నిర్వాసితుల ఆశలపై ముఖ్యమంత్రి జగన్‌ నీళ్లు చల్లారు. కాలువల ఆధునికీకరణనే మరిచారు. ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార ఉపరితల జలాలు అందిస్తున్నామంటూ అసలు ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ప్రారంభించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, సమస్యలు తీర్చకుండా సిక్కోలు ప్రజలను అడుగడుగునా వంచించిన జగన్‌.. ఓట్లు అడగడానికి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.పూర్తి కథనం

8. అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి

గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.పూర్తి కథనం

9. గరం.. గరం

రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఇక్కడ 45 డిగ్రీలు ఉంది. ఈ జిల్లాలోని వేములపల్లి, దామరచర్ల, అనుముల హాలియా, తిరుమలగిరి(సాగర్‌), త్రిపురారం, గట్టుప్పల్‌, నిడమనూరు మండలాల్లోనూ 44 డిగ్రీల ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. పూర్తి కథనం

10. కాస్త దిగొచ్చిన బంగారం

ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.74,300, కిలో వెండి రూ.83,300 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో బంగారం ధర రూ.73,500కు దిగి వచ్చినా మళ్లీ కొంత పెరిగింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని