Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Apr 2024 09:09 IST

1. జగనన్న ఇల్లు.. రాలేదన్నా!

నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. పేదలకు ఇళ్లు దక్కలేదు. పూరిళ్లు, అద్దె ఇళ్లలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. కావలి పట్టణంలో వేలాది మంది ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి కథనం 

2. కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌కు సర్వే గండి

ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వడమే ఇందుకు కారణం.పూర్తి కథనం 

3. రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి

గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ జనం నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక.. వారిపై దాడులకు తెగబడుతున్నారు. మొన్న నీటి కోసం గుడివాడ పట్టణ ప్రజలు నిలదీస్తే.. నేడు రహదారులు ఎందుకు వేయలేదంటూ గ్రామీణ ప్రాంతాల యువత నిలదీస్తున్నారు. పూర్తి కథనం 

4. చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్‌?

‘నా అక్కచెల్లెమ్మలు’ అని చెప్పే జగన్‌కు నిజంగా వారిపై ఉన్న ప్రేమ ఎంత? సొంత చెల్లెమ్మలకే న్యాయం చేయనప్పుడు.. ఇతరులకేం చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. సొంత అన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా ఇద్దరు చెల్లెమ్మలు కొంగు చాచి ప్రజలను కోరుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు.పూర్తి కథనం 

5. పేరుకే పెంపు.. ఊకదంపు

ముఖ్యమంత్రి జగన్‌... ఆరోగ్యశ్రీని అస్వస్థతకు గురిచేసి, అనారోగ్య పీడితుల్ని వంచిస్తున్నారు. నవరత్నాల్లో పేర్కొన్న ప్రకారం ఈ పథకం సేవలను ఉద్ధరించేసినట్లు తన భుజాలను తానే చరుచుకుంటున్న సీఎం తీరు విస్తుగొలుపుతోంది. చికిత్స చేసే వ్యాధుల సంఖ్యను, ఖర్చు చేసే డబ్బుల పరిధినీ పెంచామని ప్రచారం చేసుకుంటున్నారు.పూర్తి కథనం 

6. ఓబీసీలకు శత్రువు కాంగ్రెస్‌

కర్ణాటకలో ఓబీసీల కోటా తగ్గించి, ఆ కేటగిరీలో ముస్లింలను చేర్చిన కాంగ్రెస్‌ పార్టీ దేశమంతా అదే విధానాన్ని అనుసరించాలని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్ల అమలుకు దొడ్డి దారిన ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఓబీసీలకు పెద్ద శత్రువని ధ్వజమెత్తారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌, హర్దాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌ ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. పూర్తి కథనం 

7. జగన్‌ బీ‘మాయ’

ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. పథకానికి అర్హత సాధించలేక.. పరిహారం అందక వేల కుటుంబాలు కకావికలమయ్యాయి.పూర్తి కథనం 

8. ‘జే’గనాసురుడి విషపు సుక్క

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్‌ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్‌, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దుకాణాల సంఖ్య తగ్గించిన జగన్‌ ధరలు భారీగా పెంచారు. ఒకప్పుడు రూ.50 ఉన్న సీసా ధర ఏకంగా రూ.150కు పెంచేశారు. పూర్తి కథనం 

9. మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

రాష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.పూర్తి కథనం 

10. అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!

సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతం అది. పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఆ ‘పురం’ అక్కడి ప్రధాన వాణిజ్య కేంద్రం. బ్రిటిష్‌ హయాంలోనే ఆ ఊరికి ఎంతో పేరున్నా.. జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలున్నా.. ఆ ప్రజాప్రతినిధి కృషి లేకపోవడంతో పునర్విభజనలో అవకాశం దక్కలేదు. ఈ నియోజకవర్గంలో ‘రాజు’గా వెలుగొందుతున్న ఆ నేతకు ప్రతిదీ ప్రసాదమే.. అన్నీ ఆరగించడమే!పూర్తి కథనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని