Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Mar 2024 09:10 IST

1. వాలంటీర్ల మెడపై కత్తి!

వాలంటీర్లు చాలామంది అడ్డం తిరుగుతున్నారు. ఇప్పుడు రాజీనామా చేసేస్తే తిరిగి వైకాపా ప్రభుత్వం వచ్చినా ఉద్యోగం ఇస్తారనే నమ్మకమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎలాగూ మీరు చెప్పినట్లుగా అన్నీ చేస్తున్నాం.. కదా.. తిరిగి మాపై రాజీనామా కత్తి పెట్టడమేమిటని నేతలను గట్టిగా నిలదీస్తున్నారు. పూర్తి కథనం

2. కదలని ‘ధరణి’ దరఖాస్తులు

ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలతోపాటు సాధారణ అర్జీలు కూడా ముందుకు కదలడం లేదు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగానే ఏదీ పరిశీలించడం లేదంటూ చాలా జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం రైతులకు బదులిస్తోంది. ధరణిలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. 2.45 లక్షల వినతులను వెంటనే పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసింది.పూర్తి కథనం

3. వైకాపా ఫ్యాన్‌కు సౌండ్‌ ఎక్కువ.. గాలి తక్కువ

వైకాపా ఫ్యానుకు సౌండ్‌ ఎక్కువ... గాలి తక్కువ.. ఆ పార్టీని నమ్మొద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పాతికేళ్ల భవిష్యత్తు కావాలా? రూ.5 వేల జీతం కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వైకాపా కావాలా.. మీ కోసం నిలబడే కూటమి కావాలా తేల్చుకోవాలని కోరారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో శనివారం రాత్రి ఆయన ప్రసంగించారు.పూర్తి కథనం

4. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకోం

కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. భాజపా ఎమ్మెల్యేల్లో ఒకరిని ముట్టుకున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 48 గంటల్లోపు కూలిపోతుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్‌రెడ్డి స్పందించారు. పూర్తి కథనం

5. జగన్‌కో దండం.. వచ్చారంటే గండం

సారొస్తున్నారంటే.. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిందే. అత్యవసరమైనా.. ఆపదలో ఉన్నా.. అవస్థలు పడుతున్నా.. సామాన్య ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆయనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయినా.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినా.. అవేమీ పట్టించుకోరు.పూర్తి కథనం

6. సభావేదిక.. సత్తా చాటాలిక

హైదరాబాద్ మహానగరంపై పట్టుకోసం ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలపై దృష్టిసారించాయి. ఈ సభలకు లక్షలమందిని రప్పించడం ద్వారా తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్‌, రెండోవారంలో భారాస భారీ సభలు నిర్వహిస్తున్నాయి. భాజపా కూడా భారీ సభ నిర్వహించి అగ్రనేతలను  రప్పించాలని నిర్ణయించింది.పూర్తి కథనం

7. వంశీ వచ్చారు.. నగదు పంచారు..!

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తొలిరోజే నగదు పంపకాలకు తెరదీశారు... కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌..! పోటీపై తర్జన భర్జన పడిన వంశీకి... ఎట్టకేలకు వైకాపా అధిష్ఠానం టికెట్‌ కేటాయించడంతో గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.పూర్తి కథనం

8. పవార్‌ కుటుంబంలో ‘పవర్‌’ కుస్తీ.. బారామతిలో వదినా-మరదళ్ల పోరు!

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆసక్తికర పోరుకు తెర లేచింది. పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం.. అదే కుటుంబ సభ్యుల మధ్య పోరుకు వేదికైంది. ఈ స్థానం నుంచి శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలె పోటీ పడుతుండగా.. అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌ కూడా అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి కథనం

9. డొక్కు బస్సులు.. ఛార్జీల బాదుళ్లు.. అనగనగా ఒక ప్రజాపీడకుడు!

ప్రతిపక్షనేతగా జగన్‌ జనాన్ని ఎంతగా మభ్యపెట్టారంటే- తాను ముఖ్యమంత్రిని కాకపోతే ఆర్టీసీ మిగలదంటూ కల్లబొల్లి జోస్యాలు చెప్పారు. అలాంటి పచ్చి అబద్ధాలతో ఎలాగైతేనేం సీఎం అయ్యారు. ఆపై ఆర్టీసీ ప్రగతి రథచక్రాలకు పంక్చర్‌ చేసిన జగన్‌- ప్రయాణికుల ప్రాణాలను గాల్లో దీపాలుగా మార్చేశారు. పది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కవిటి వైపు వెళ్తున్న బస్సు.. స్టీరింగ్‌ పట్టేసి నడిరోడ్డుపై ఆగిపోయింది.పూర్తి కథనం

10. ఇక ‘విశ్రాంతి’

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో అప్పట్లో రిటైరవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణలు మూడేళ్ల తర్వాత ఈ ఏడాది మొదలయ్యాయి. మార్చి 31 ఆదివారం కావడంతో మార్చి 30న శనివారం ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని