Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Mar 2024 09:07 IST

1. ప్రజల మనిషి చంద్రబాబు

కార్మికుల కోసం బలంగా పోరాడే వ్యక్తి చంద్రబాబునాయుడు అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు వంటి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఆయన ప్రజల కోసం బతికే మనిషని అన్నారు. శనివారం గూడూరు పరిధిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మహిళ శ్రామిక శక్తితో భువనమ్మ మాటామంతీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పూర్తి కథనం

2. జనసేనలో 3 స్థానాలే పెండింగ్‌

తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఇందులోని ఏడు స్థానాలను పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. 11 స్థానాలకు సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి వారికి విధివిధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చజెండా ఊపారు. పూర్తి కథనం

3. కాస్త.. నవ్వండి గురూ

‘హ్యాపీ ఇండెక్స్‌’లో భారత్‌ది 126వ స్థానం. మొత్తం 146 దేశాల్లో సర్వే చేస్తే.. మనం చివరి నుంచి 17వ స్థానంలో ఉన్నాం. అదేంటి ఎన్నో ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ మనకంటే మంచి స్థానం(108)లో ఉందే అని ఆశ్చర్యపోకండి. సర్వే అదే చెబుతోంది. భారతదేశంలాంటి భిన్న ప్రాంతాలు..వైవిధ్యం ఉన్న దేశాల్లో సంతోషాన్ని కొలవడం కష్టమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెబుతున్నారు.పూర్తి కథనం

4. గంజాయి, డ్రగ్స్‌లో ఏపీ టాప్‌

పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల కల్పన వంటి రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. జగన్‌ మాత్రం గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, డ్రగ్స్‌లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టారు. ఏ రాష్ట్రమైనా.. కేంద్రప్రభుత్వ శాఖలు విడుదల చేసే వివిధ రకాల ప్రగతి నివేదికల్లో, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో ముందువరుసలో ఉండాలని అనుకుంటుంది. పూర్తి కథనం

5. రంజాన్‌ ఘుమఘుమలు.. ఓల్డ్‌ సిటీలో అర్ధరాత్రైనా జనాల కిటకిట

పాతనగరంలో రంజాన్‌ సందడి మొదలైంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రుళ్లూ జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్‌ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు ఛలో చార్మినార్‌ అంటున్నారు.పూర్తి కథనం

6. తెదేపా అంతర్గత సమావేశాలపైనా ‘నిఘా’

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలంటే అసాంఘిక శక్తులే అన్న రీతిలో నిఘా విభాగం వ్యవహరిస్తోంది. ఏదైనా సభ ఏర్పాటు చేశారంటే దానిపై డేగకన్ను వేస్తోంది. సమావేశం పెట్టుకున్నారంటే చాలు వెంటనే అక్కడ వాలిపోతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక అయినా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఈ విభాగం.. ఇప్పటికీ అధికారపార్టీ జేబు సంస్థగా పనిచేస్తోంది.పూర్తి కథనం

7. వీసాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు!

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల వీసా(ఎఫ్‌1) ఇంటర్వ్యూ సమయాల(స్లాట్ల) కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. సాధారణంగా ఫాల్‌ సీజను ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుతుంది. అందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. ఈ దఫా మార్చి నెల ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు విడుదల చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది.పూర్తి కథనం

8. సీ విజిల్‌.. ఉల్లంఘనులకు హడల్‌

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ విజిల్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి కథనం

9. మా కండువా మారలేదు.. మారింది మీదే: మందకృష్ణ

‘మా నల్ల కండువా మారలేదు..మీ మెడలో ఎన్ని కండువాలో మారాయో తెలుసు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేయించింది డూప్లికేట్‌ యుద్ధం. మేము దిగితే ప్రత్యక్ష యుద్ధమే’నని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగల సహకారంతోనే మొదట్నుంచి రాజకీయాల్లో ఎదిగానని రేవంత్‌రెడ్డి ఇటీవల చెప్పిన వీడియోలను ఆయన శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శించారు. పూర్తి కథనం

10. స్థానిక అవసరాలకు ఇసుక ఉచితం

గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు, ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనులశాఖ ముఖ్యకార్యదర్శి బెన్హర్‌ మహేశ్‌దత్‌ ఎక్కా శనివారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు-2015ను అమలు చేయాలని స్పష్టం చేశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని