Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jun 2024 21:00 IST

1.కేంద్ర క్యాబినెట్‌లోకి రామ్మోహన్‌నాయుడు.. సిక్కోలు ప్రజలకు కృతజ్ఞతలు..

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న సత్తెనపల్లి జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు సుబ్బారావును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. పూర్తి కథనం

2. నటుడు ప్రేమ్‌జీ వివాహం.. సందడి చేసిన సెలబ్రిటీస్‌

నటుడు ప్రేమ్‌జీ అమరన్‌ (Premgi Amaren) ఓ ఇంటివాడయ్యారు. స్నేహితురాలైన ఇందును వివాహం చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ప్రేమ్‌జీ సోదరుడు, దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu), నటులు జై (Jai), వైభవ్‌ (Vaibhav Reddy) తదితరులు ప్రేమ్‌జీని ఆటపట్టిస్తూ సందడి చేశారు. పూర్తి కథనం

3.  ‘మిస్టర్ 360’ కాదు.. అతడు ఉండటమే భారత్‌కు ప్లస్‌: సూర్య చిన్ననాటి కోచ్

ఇప్పుడు క్రికెట్ అభిమానుల కళ్లన్నీ భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌పైనే. టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) దాయాదుల పోరు చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టీమ్‌ఇండియా నుంచి ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి కథనం

4. ఎన్నికల ఫలితాలు.. ₹14,800 కోట్ల ఎఫ్‌పీఐలు వెనక్కి

విదేశీ సంస్థాగత మదుపర్లు (Foreign Investors) పెద్దఎత్తున పెట్టుబడులను దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.. అదే సమయంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెల మొదటి వారంలో ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి దాదాపు రూ.14,800 కోట్లను వెనక్కి తీసుకున్నారు. పూర్తి కథనం

5. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ప్రముఖుల సందడి

భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ  ప్రమాణస్వీకారోత్సవంలో ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు  సార్క్‌ సభ్యదేశాల ప్రతినిధులు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చారు. పూర్తి కథనం

6. నలుగురు బందీలను కాపాడేందుకు.. 274 మందిని బలిగొని!

గాజాలో ఉద్ధృత పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సెంట్రల్‌ గాజాలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి.. నలుగురు బందీలను కాపాడినట్లు ఇజ్రాయెల్‌ (Israel) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో టెల్‌అవీవ్‌ దళాలు జరిపిన దాడుల్లో స్థానికంగా భారీ ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.  పూర్తి కథనం

7. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి.. పది మంది మృతి?

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో యాత్రికుల బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రియాసిలో చోటు చేసుకొంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు.  పూర్తి కథనం

8. ‘సీఎంజీ జాగ్రత్త.. కల్పనా సోరెన్‌ వచ్చేశారు’: భాజపా ఎంపీ హెచ్చరిక

ఝార్ఖండ్‌ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ (Kalpana Soren) ఉప ఎన్నికలో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భాజపా (BJP) ఎంపీ నిషికాంత్‌ దూబె (Nishikant Dubey).. ప్రస్తుత సీఎం చంపాయీ సోరెన్‌ను హెచ్చరించారు. పూర్తి కథనం

9. ఒడిశాలో బీజేడీ ఓటమి.. రాజకీయాలకు వీకే పాండ్యన్‌ గుడ్‌బై

ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆంతరంగికుడిగా పేరొందిన మాజీ ఐఏఎస్‌ అధికారి వీకే పాండ్యన్‌ (VK Pandian) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (BJD) ఓటమి నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు.  పూర్తి కథనం

10. భాజపాలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు: నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ

కేంద్రమంత్రివర్గంలో తనకు చోటు కల్పించడం పట్ల నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపా కార్యకర్తగా నా జీవితం ప్రారంభమైంది. గత 34 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నాను.  పూర్తికథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు