Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 May 2024 21:00 IST

1. కంగనా vs విక్రమాదిత్య.. వేడెక్కిన ‘మండి’ రాజకీయం!

యువనేతల ముమ్మర ప్రచారంతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడినుంచి బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌ (Kangana Ranaut).. కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌ (Vikramaditya Singh)ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కాజా ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన కంగనాకు స్థానికుల నుంచి నిరసనలు ఎదురుకావడాన్ని విక్రమాదిత్య లక్ష్యంగా చేసుకున్నారు. పూర్తి కథనం

2. పథకం ప్రకారమే అరాచకం.. పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలి: బ్రహ్మారెడ్డి

పల్నాడు జిల్లా మాచర్లలో పథకం ప్రకారమే వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి తెలుగుదేశం నేతలు  దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని బ్రహ్మారెడ్డి డిమాండ్‌ చేశారు.పూర్తి కథనం

3. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. రోజుకు 50 వేల మందికి దర్శనం

 వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భవానీదీక్షలు, దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వస్తున్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు.పూర్తి కథనం

4. మీ విజయాన్ని చూడాలని ఉంది: హాట్‌టాపిక్‌గా సమంత పోస్ట్‌

ప్రముఖ హీరోయిన్‌ సమంత (samantha) పెట్టిన తాజా పోస్ట్‌ చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టిన ఆమె మనసులోని మాట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ‘‘మీ విజయాన్ని చూడాలని ఉంది’’ అని రాసి ఉన్న ఇమేజ్‌ను షేర్‌ చేస్తూ.. ‘మీ హృదయం ఏం కోరుకున్నా.. మీ ఆకాంక్షలు ఏమైనా.. నా సపోర్ట్‌ ఉంటుంది.పూర్తి కథనం

5. సెప్టెంబర్ నుంచి కొత్త టెలికాం నిబంధనలు.. రానున్న మార్పులివే..!

టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (DoT) త్వరలో అమలు చేయనుంది. ఈ విషయంపై డాట్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో సిఫార్సు చేసింది.పూర్తి కథనం

6. బీమా కార్పొరేట్‌ ఏజెంట్‌గా మహీంద్రా ఫైనాన్స్‌

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌ యాక్ట్‌, 1938 ప్రకారం కార్పొరేట్‌ ఏజెంట్‌గా వ్యవహరించడానికి IRDAI నుంచి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందినట్లు ప్రకటించింది. ఈ రిజిస్ట్రేషన్‌ 2024 మే 21 నుంచి 2027 మే 20 వరకు చెల్లుబాటులో ఉంటుందని మహీంద్రా ఫైనాన్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.పూర్తి కథనం

7. రాజధానిలో కలకలం.. నార్త్‌ బ్లాక్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌

దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్‌ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు.పూర్తి కథనం

8. ఆకలి కేకలు మా యుద్ధతంత్రం కాదు: నెతన్యాహు

యుద్ధ నేరాల కింద ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu)కు అరెస్టు వారెంట్‌ ఇవ్వాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ICC)లో ప్రధాన ప్రాసిక్యూటర్ అభ్యర్థన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మండిపడ్డారు. ‘అబద్ధాల మూట’ ఆధారంగానే తనపై ఆ వారెంట్‌ కోరుతున్నారని అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. పూర్తి కథనం

9. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు పాక్ సానుభూతిపరులు: మోదీ

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలు పాకిస్థాన్ సానుభూతిపరులని ప్రధాని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ పాకిస్థాన్  అణుశక్తిని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్‌పై కన్నేసిన ఆ దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసం అల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

10. పెను ప్రమాదంగా రక్తహీనత సమస్య.. ఏటా వేలాది మరణాలు

రక్తహీనత సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 174 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గ్లోబల్ న్యూట్రిషన్ గతేడాది నిర్వహిచింన సర్వే తేల్చింది. భారత్‌లోనూ ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. తెలుగురాష్ట్రాల్లో జాతీయ సగటుతో పోలిస్తే అధికంగా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని