Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 May 2024 20:59 IST

1.ఈవీఎం ధ్వంసం ఘటన.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న సత్తెనపల్లి జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు సుబ్బారావును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. పూర్తి కథనం

2. కిర్గిజ్‌స్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు: ఏపీ ఎన్‌ఆర్‌టీ

కిర్గిజ్‌స్థాన్‌ (Kyrgyzstan)లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సీఈవో హేమలత తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ గురువారం నుంచి ప్రతిరోజు కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌  నుంచి దిల్లీకి నేరుగా రెండు విమానాలు నడుపుతోందని వెల్లడించారు. పూర్తి కథనం

3. పులివర్తి నానిపై హత్యాయత్నం .. విచారణ వేగవంతం చేసిన పోలీసులు

తిరుపతి ఎస్వీ మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణ వేగవంతం చేశారు. నానిని ఎస్‌వీయూ క్యాంపస్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి.. తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ మురళీ మోహన్‌ వివరాలు సేకరించారు.పూర్తి కథనం

4. ఇలా దిల్‌ రాజు మాత్రమే చేయగలరు: అల్లు అరవింద్‌

వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నూతన దర్శకుడు అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గురువారం నిర్వహించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి కథనం

5. 10 ఏళ్ల బాలీవుడ్‌ ప్రయాణంపై కృతి పోస్ట్‌.. శుభాకాంక్షలు చెబుతున్న ఫ్యాన్స్‌

బాలీవుడ్‌లో తన తొలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నటి కృతి సనన్ (Kriti Sanon) పోస్ట్‌ పెట్టారు. ‘హీరోపంటీ’తో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బీటౌన్‌లో వరుస సినిమాలు చేసి అలరిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆనందం వ్యక్తంచేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. పూర్తి కథనం

6. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌- బీజాపూర్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి గురువారం కూంబింగ్‌ చేపట్టారు. పూర్తి కథనం

7. ఇప్పుడు భారత ప్రధాన కోచ్‌గా రాలేను..: రికీ పాంటింగ్

మరో నాలుగు రోజుల్లో భారత ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఈ రేసులో కొత్త పేర్లు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే స్టీఫెన్ ప్లెమింగ్, జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, సెహ్వాగ్.. ఇలా లిస్ట్‌ చాలా ఉంది. అయితే, ఇప్పటివరకు ‘మేం రెడీ’ అంటూ ఎవరూ చెప్పలేదు.  పూర్తి కథనం

8. ఎయిరిండియా ఉద్యోగులకు వేతన పెంపు.. వారికి ₹1.8 లక్షల వరకు బోనస్‌

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) తమ ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది. పైలట్ల పనితీరు ఆధారంగా బోనస్‌ కూడా చెల్లించనుంది. ప్రభుత్వం నుంచి టాటాల చేతికొచ్చాక టాటా గ్రూప్‌ చేపట్టిన తొలి వేతన పెంపు ఇదే. ఈమేరకు వేతన పెంపు వివరాలను ఎయిరిండియా సీహెచ్‌ఆర్‌ఓ రవీంద్రకుమార్‌ జీపీ వెల్లడించారు. పూర్తి కథనం

9. రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలా చేస్తే..!: కేజ్రీవాల్‌

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంలో జైలుకు వెళ్లిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జైలు నుంచే పాలనా వ్యవహారాలు చేస్తున్నానని చెబుతున్న ఆయనను.. రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై దిల్లీ సీఎం స్పందించారు. పూర్తి కథనం

10. సునీతా విలియమ్స్‌ రోదసి యాత్రకు మళ్లీ సమస్యలు.. ఇక ప్రయోగం వచ్చే నెలలోనే..

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్‌ 1 నుంచి 5వ తేదీల్లో ఈ ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని నాసా (NASA) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని