AP NRT: కిర్గిజ్‌స్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు: ఏపీ ఎన్‌ఆర్‌టీ

కిర్గిజ్‌స్థాన్‌ (Kyrgyzstan)లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సీఈవో హేమలత తెలిపారు.

Updated : 23 May 2024 20:33 IST

అమరావతి: కిర్గిజ్‌స్థాన్‌ (Kyrgyzstan)లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సీఈవో హేమలత తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ గురువారం నుంచి ప్రతిరోజు కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌  నుంచి దిల్లీకి నేరుగా రెండు విమానాలు నడుపుతోందని వెల్లడించారు. అక్కడి తెలుగు విద్యార్థులతో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ నిరంతరం మాట్లాడుతూ కౌన్సెలింగ్‌ ఇస్తోందన్నారు. విద్యార్థుల భద్రతపై ఎప్పటికప్పుడు విదేశీ వ్యవహారాల శాఖకు తెలియజేస్తున్నామన్నారు.

ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నందున విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చే ముందు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మార్గదర్శకాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కిర్గిజ్‌స్థాన్‌లోని భారతీయ విద్యార్థులు బిష్కెక్‌లోని రాయబార కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. భారత రాయబార కార్యాలయం 0555710041 హెల్ప్‌లైన్‌ నెంబరు ఏర్పాటు చేసిందని వివరించారు. కిర్గిస్థాన్‌ రాజధాని నగరం బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ఓ మూక హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని