Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 May 2024 20:59 IST

1.కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలి.. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

ఓటమికి కారణాలు వెతుకుతున్న వైకాపా నేతలు ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నాక పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్‌ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు.  పూర్తి కథనం

2. 2 నిమిషాల 30 సెకన్లతో తెలంగాణ రాష్ట్ర గీతం?

 ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు. 2 నిమిషాల 30 సెకన్లతో రాష్ట్ర గీతం సాగనున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం

3. ఏపీలో పింఛన్ల సొమ్ము విడుదల.. ఈ సారీ బ్యాంకు ఖాతాల్లోనే

 జూన్‌ నెలకు సంబంధించి సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 65,30,808 మంది పెన్షనర్లకు రూ.1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు  గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. పూర్తి కథనం

4. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను: మమ్ముట్టి

చివరి శ్వాస వరకూ తాను నటిస్తూనే ఉంటానన్నారు మమ్ముట్టి (Mammootty). భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మరణించే చివరి క్షణం వరకు నటించినప్పటికీ తర్వాత ఎవరూ తనను గుర్తుపెట్టుకోరన్నారు. పూర్తి కథనం

5. ‘‘ఆ నాలుగే.. టీ20 వరల్డ్‌ కప్ సెమీఫైనలిస్ట్‌లు’’

జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సంబరం మొదలుకానుంది. విండీస్ - యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కెనడాతో యూఎస్‌ఏ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. భారత జట్టు జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌, యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌తో కూడిన గ్రూప్‌లో టీమ్‌ఇండియా ఆడనుంది. పూర్తి కథనం

6. బుమ్రా ఒక్కడే నిలకడగా యార్కర్లు సంధించే బౌలర్: బ్రెట్‌ లీ

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) అందరి దృష్టి భారత స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రాపైనే (Jasprit Bumrah) ఉందనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ.. బుమ్రా వద్ద ఉన్న ప్రత్యేకత వారెవరికీ లేదనేది మాజీ క్రికెటర్ల మాట. అతడు సంధించే యార్కర్లను అడ్డుకోవడం హేమాహేమీ బ్యాటర్లకే సాధ్యపడదు. ఈ పొట్టి కప్‌లో బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ వ్యాఖ్యానించాడు. పూర్తి కథనం

7. నువ్వేమీ భయపడొద్దు.. నేనున్నా.. అభిమానికి ధోనీ భరోసా

ఐపీఎల్‌ (IPL 2024)17వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఇటీవల తలపడిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ మధ్యలో ఎమ్‌ఎస్‌ ధోనీ (MS Dhoni) అభిమాని ఒకరు మైదానంలోకి దూకి అందరి దృష్టిని ఆకర్షించాడు. నేరుగా మహీ పాదాలను తాకాడు.   పూర్తి కథనం

8. కలిసి పనిచేయనున్న MG మోటార్‌, HPCL

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL)తో చేతులు కలిపినట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ MG మోటార్‌ ఇండియా బుధవారం తెలిపింది. ఈ భాగస్వామ్యం ప్రకారం MG, HPCL కలిసి భారత్‌లోని హైవేలు, నగరాలను కవర్‌ చేసే కీలక ప్రదేశాలలో 50KW/60KW DC ఫాస్ట్‌ ఛార్జర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నాయని MG Motor India ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి కథనం

9. నవీన్‌ పట్నాయక్‌ ‘ఆరోగ్యంపై కుట్ర’?.. ప్రధాని మోదీ అనుమానాలు!

డిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ప్రధాని మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. దాని వెనక ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే.. సీఎం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి కథనం

10. సొంత సిబ్బందినే రక్షించుకోలేని ఐరాస.. దేనికోసం ఎదురుచూస్తోంది: ఎర్డోగన్

రఫాలో ఇజ్రాయెల్‌ జరిపిన పాశవిక దాడిపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ (Erdogan)తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి (UN) పనితీరును ఎండగట్టారు. ఇస్లామిక్ ప్రపంచం దీనిపై స్పందించాలని పిలుపునిచ్చారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని