Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Apr 2024 13:13 IST

1.  అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు

అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీ ఫారాలు అందజేసి ప్రమాణం చేయించారు. పూర్తి కథనం

2. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై చర్చ జరగాలి: దువ్వూరి సుబ్బారావు

ఉచిత హామీల (Freebies) విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే అంశంపై సమగ్ర చర్చ జరగాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు (D Subbarao) అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అసవరం ఉందన్నారు. అందుకోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.పూర్తి కథనం

3. ఏపీలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు: నారా బ్రాహ్మణి

ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. పూర్తి కథనం

4. రాధాకిషన్‌రావును కరీంనగర్‌ తరలించిన అధికారులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కరీంనగర్‌ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది.పూర్తి కథనం

5. రిషభ్‌ పంత్‌.. నువ్వెప్పుడూ తలొంచకూడదని కోరుకుంటా: గావస్కర్

అరుణ్‌జైట్లీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీపై హైదరాబాద్‌ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో ఆ జట్టు కెప్టెన్ రిషభ్‌ పంత్ నిరాశకు గురయ్యాడు. పూర్తి కథనం

6. ముయిజ్జు పాలనకు అగ్నిపరీక్ష: నేడు మాల్దీవుల్లో పార్లమెంటు ఎన్నికలు

ద్వీపదేశం మాల్దీవులో పార్లమెంట్‌ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఇవి అధ్యక్షుడు ముయిజ్జు పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఆయన అధికారం చేపట్టాక భారత వ్యతిరేక వైఖరిని అనుసరించారు. ఈ క్రమంలో అక్కడున్న మన బలగాలను వెనక్కి పంపించారు. ​​​​​పూర్తి కథనం

7. కాంగ్రెస్‌ జోరు.. విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ నేతల ప్రచారం

తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ.. విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తోంది.పూర్తి కథనం

8. రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మంకు తీవ్రగాయాలు

బాపట్ల జిల్లా అద్దంకి-రేణింగివరం మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఇటుక లోడుతో రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని బ్రహ్మంచౌదరి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.పూర్తి కథనం

9. ఇజ్రాయెల్‌ దళంపై అమెరికా ఆంక్షలు?.. మండిపడ్డ నెతన్యాహు!

‘ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ( IDF)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తినీయులపై మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ యాక్సియోస్‌ వార్తాసంస్థ శనివారం ఓ కథనం ప్రచురించింది.పూర్తి కథనం

10. విద్యార్థినిని పరీక్షాకేంద్రంలో దింపి సాయం చేసిన సీఐ

పరీక్షకు ఆలస్యమవుతున్న ఓ విద్యార్థినికి నారాయణగూడ సీఐ చంద్రశేఖర్‌ సాయం చేశారు. పోలీసు వాహనంలో విద్యార్థినిని పరీక్ష కేంద్రంలో దింపారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని