Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Apr 2024 13:01 IST

1. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమెందుకు?: సీబీఐకి సుప్రీం ప్రశ్న

జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. విచారణ వేగంగా పూర్తిచేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఆదేశించింది. పూర్తి కథనం 

2. ఎన్నికలముందు ‘కచ్చతీవు’ రగడ.. జై శంకర్ ఏమన్నారంటే..?

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ‘కచ్చతీవు’ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై తాజాగా విదేశాంగమంత్రి జై శంకర్(S Jaishankar) స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదన్నారు.పూర్తి కథనం 

3. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా: కడియం శ్రీహరి

భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. తన కుమార్తె కావ్యతో కలిసి హనుమకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు.పూర్తి కథనం 

4. బుద్ధి మార్చుకోని చైనా.. అరుణాచల్‌లో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు 

వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా (China) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ (India)లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) తమదేనంటూ వితండవాదం చేస్తున్న డ్రాగన్‌.. మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేసినట్లు ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కథనం వెల్లడించింది.పూర్తి కథనం 

5. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. తిహాడ్‌ జైలుకు సీఎం

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది.పూర్తి కథనం 

6. అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లో వరుస చోరీలు.. దొంగలెవరో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత భద్రత మధ్య ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ’ (Air Force One) విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది.. హస్తలాఘవం ప్రదర్శిస్తున్న సదరు వ్యక్తులను హెచ్చరించారు.పూర్తి కథనం 

7. బందీల కుటుంబాల నుంచి నెతన్యాహుకు నిరసన!

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. జెరూసలెంలోని పార్లమెంట్‌ ముందు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. హమాస్‌ (Hamas) చెరలో ఉన్న బందీలను వెంటనే తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.పూర్తి కథనం 

8. వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.30.50 తగ్గి రూ.1,764.50కు చేరింది. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. పట్నాలో గరిష్ఠంగా ఒక్కో సిలిండర్‌పై రూ.33 వరకు తగ్గింది.పూర్తి కథనం 

9. కొత్త ఆదాయపు పన్ను విధానంపై తప్పుడు సమాచారం.. కేంద్రం క్లారిటీ!

మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం (Old Financial Year) కాల పరిమితి ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం (New Financial Year) ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది.పూర్తి కథనం 

10. పింఛన్ల పంపిణీపై జగన్‌ది వికృత క్రీడ: తెదేపా

తెదేపా వల్లే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిందంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. నగదును ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా, తెనాలి శ్రవణ్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడారు.పూర్తి కథనం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని