Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 12 Apr 2024 12:59 IST

1. ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. కృష్ణా జిల్లా టాప్‌

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. పూర్తి కథనం

2. ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నాయకులవి: ప్రధాని మోదీ

లోక్‌సభలో భాజపా (BJP) వరుసగా రెండు సార్లు సాధించిన మెజార్టీని తమ ప్రభుత్వం ఈ దేశాభివృద్ధి కోసమే ఉపయోగించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. కానీ, అంతకుముందు కాంగ్రెస్‌ (Congress) మాత్రం దశాబ్దాల పాటు తమకున్న మెజార్టీతో ఓ కుటుంబాన్ని బలోపేతం చేసిందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసని ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

3. నాడు కన్నబిడ్డలను హతమార్చి.. నేడు ఆత్మహత్య!

గత నెలలో తమ కుమార్తెలను హతమార్చిన తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడేనికి చెందిన పి.అనిల్‌(26), దేవి (22)..  గ్రామానికి సమీపంలోని అడవిలో ఉరి వేసుకున్నారు.పూర్తి కథనం

4. త్వరలో దిల్లీలో రాష్ట్రపతి పాలన..! ఆతిశీ సంచలన ఆరోపణలు

ఆప్‌ నేతలు మరోసారి సంచలన ఆరోపణలకు తెరతీశారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా (BJP) యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) ఆందోళన వ్యక్తం చేశారు.పూర్తి కథనం

5. ‘రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌’ కేసులో..టోపీ ఆధారంగా బాంబర్‌ అరెస్ట్‌..!

రామేశ్వరం కెఫే (Rameshwaram Cafe) బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌, సూత్రధారి అబ్దుల్ మతీన్‌ తాహాను అరెస్టు చేసింది.పూర్తి కథనం

6. ఆ చిన్నారుల ప్రాణాలు దక్కేవే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టి బస్సు ‘కీ’ లాక్కున్న స్థానికులు

హరియాణాలో గురువారం జరిగిన స్కూల్‌ బస్సు ప్రమాదం (Haryana School bus crash) దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సెలవు రోజు పాఠశాల తెరవడంతో పాటు స్కూల్‌ బస్సుల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు చిన్నారుల మృతికి కారణమైన ఈ ప్రమాదంలో తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.పూర్తి కథనం

7. యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు

వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ (Britain) ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా (UK Family Visa) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచింది.పూర్తి కథనం

8. ఆమె బ్యాంకునే మింగేసిన ఆర్థిక అనకొండ..!

ఆమె ఓ బిలియనీర్‌.. ఆ మహిళ తెలివితేటలు చూస్తే ఎంతటి ఆర్థిక నిపుణుడైనా కళ్లు తేలేయాల్సిందే.. ప్రజల సొమ్మును కొట్టేసేందుకు ఓ బ్యాంకుపై అక్రమ మార్గాల్లో నియంత్రణ సాధించింది. ఇంకేముంది.. తప్పుడు రుణపత్రాలను సమర్పించడం.. డబ్బు డ్రా చేసుకోవడం. ఈరకంగా ఆ దేశ జీడీపీలో ఏకంగా 3 శాతానికి సమానమైన మొత్తాన్ని స్కాం చేసి దాదాపు బ్యాంకు సొమ్ము మొత్తం మింగేసింది.పూర్తి కథనం

9. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సత్తా చాటేందుకు జాతీయ పార్టీల వ్యూహాలు

కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముందు నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న జాతీయ పార్టీలు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. దిల్లీలో క్లీన్ స్వీప్ చేసి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 స్థానాల్లో ఐదింట నెగ్గిన భాజపా.. ఈసారి మరిన్ని సీట్లు పెంచుకోవాలని యత్నిస్తోంది. సర్వేలు కూడా భాజపాకు అనుకూలంగానే ఉన్నాయి. పూర్తి కథనం

10. రైళ్లలో భారీగా పెరుగుతున్న గంజాయి రవాణా

కోట్లాది మంది ప్రజల్ని గమ్యస్థానాలకు తీసుకెళ్లే రైళ్లలో గంజాయి రవాణా అధికంగా సాగుతోంది. వందల కి.మీ. ప్రయాణించినా అంతంతమాత్రంగా జరిగే తనిఖీలు ప్రయాణికుల్లా నటిస్తూ అనుమానమొస్తే మధ్యలోనే తప్పించుకునే వెసులుబాటు వెరసి ఏటా గంజాయి రవాణా భారీగా పెరుగుతోంది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని