Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Apr 2024 09:15 IST

1. తాగించారు.. తూగించారు

ఆదాయం వస్తుందని తెలిస్తే చాలు.. నిబంధనలకు రాం‘రం’ అనడం, గేట్లను ‘బార్‌’లా తెరవడం జగన్‌కు ‘జిన్ను’తో పెట్టిన విద్య. జనం సొమ్మును దోచడమే కానీ.. జనం కోసం దాచడం అస్సలే తెలియని ఆయన.. మద్యం అమ్మకాలతో ప్రజలను దోచుకున్న తీరును చూస్తే ఎంతటివారైనా విస్తుపోవాల్సిందే! కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలోకి ‘జె బ్రాండ్లు’ తీసుకొచ్చిన జగన్‌.. బీదాబిక్కీ జనాన్ని పీల్చిపిప్పి చేసి వారి ప్రాణాలను బలిగొనేదాకా విశ్రమించలేదు. పూర్తి కథనం

2. రూ.40 లక్షల కోట్లకు.. మన స్థిరాస్తి రంగం

భారతీయ స్థిరాస్తి రంగం మార్కెట్‌ పరిమాణం 2015 నుంచి 73% వృద్ధి చెంది, ప్రస్తుతం  రూ.40.48 లక్షల కోట్ల (482 బిలియన్‌ డాలర్లు) స్థాయికి చేరింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఉమ్మడిగా ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌: ఎ డికేడ్‌ ఫ్రమ్‌ నౌ’ పేరిట విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.పూర్తి కథనం

3. జనం లేక బస్సులోనే జగన్‌

సత్తెనపల్లిలో సీఎం నిర్వహించిన బస్సు యాత్రకు స్పందన నామమాత్రమే. బస్సులు ఏర్పాటు చేసి, మద్యం, డబ్బు పంపిణీ చేసినా జనం రాలేదు. కొన్నిచోట్ల జగన్‌ కూడా బస్సులోనే ఉండిపోయారు. పట్టణంలో సగం దూరమే రోడ్‌షో నిర్వహించి మమ అనిపించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల నుంచి శుక్రవారం యాత్ర మొదలైంది.పూర్తి కథనం

4. బైకు పోయిందా.. ఇక అంతే!

బైకు చోరీల కేసుల పరిష్కారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటోందని బాధితులు వాపోతున్నారు. కొన్ని ఠాణాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాలు తనిఖీ చేయడం.. ఇతర ఇతర ఆధారాలతో దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా మెజార్టీ కేసులను పట్టించుకోవడం లేదు.పూర్తి కథనం

5. మాటల్లో గారడీ.. చేతల్లో బురిడీ..

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం.. మీ పిల్లల చదువుకు, కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా ఇస్తామంటూ మాయమాటలతో జగన్‌ నమ్మించారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ విషయంలో మడత పేచీ పెట్టారు.పూర్తి కథనం

6. చేటు చేస్తున్న సిమ్‌లపై వేటు

సిమ్‌కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు. దగాకోరులు ఉపయోగించే ఈ సిమ్‌లను పసిగట్టి... నిలువరించగలిగితే మోసగాళ్ల ఆట కట్టించవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.పూర్తి కథనం

7. దువ్వాడ, విశాఖ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు 

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనుందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ-కొల్లాం(08539) ప్రత్యేక రైలు ఈ నెల 17 నుంచి జులై 3 వరకు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది.పూర్తి కథనం

8. జగనన్న మాటల వంటకం..!

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ఉన్నత పాఠశాలకు శుక్రవారం 372 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో సగం మంది కూడా మధ్యాహ్న భోజనం చేయలేదు. కేవలం 105 మంది మాత్రమే భోజనం చేశారు. వారికి మెనూ ప్రకారం వడ్డించారు.పూర్తి కథనం

9. డబ్బా నీరు సురక్షితమేనా!

ప్రభుత్వ అనుమతి లేకుండా.. కనీస ప్రమాణాలు పాటించకుండా యథేచ్ఛగా నీటి శుద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌(బీఐఎస్‌) అనుమతులు పొందకుండా నీటిని విక్రయిస్తున్నారు. ఇటీవల మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులు తనిఖీలు చేయగా మెట్‌పల్లిలో కేవలం ఒక ప్లాంటుకే అనుమతి ఉన్నట్లు వెల్లడైంది.పూర్తి కథనం

10. పసిడి పరుగులు.. వెండి మెరుపులు

బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ విపణిలో ఈ లోహాల్లోకి పెట్టుబడులు అధికంగా వస్తుండటమే ఈ పరిస్థితికి కారణం. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.74,910 వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఒకదశలో రూ.76,200కు చేరింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని