Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Apr 2024 13:07 IST

1. ఏపీలో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం: నారా లోకేశ్‌

ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పూర్తి కథనం

2. ఉగ్రవాదులకు రూల్స్‌ ఉండవు.. ప్రతిస్పందన కూడా అలాగే..!: జైశంకర్‌

గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) అన్నారు. ఉగ్రవాదాన్ని (Terrorism) ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని తెలిపారు. ముష్కరులకు ఎలాంటి నియమాలు ఉండనప్పుడు.. దాడులకు ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందన్నారు.పూర్తి కథనం

3. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించి శుక్రవారం రాత్రి రిజల్ట్స్‌ విడుదల చేశారు. గ్రూప్ 1కి మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు.పూర్తి కథనం

4. సీఎం స్టాలిన్‌ కోసం రాహుల్‌ ‘స్వీట్‌’ గిఫ్ట్‌.. స్వయంగా దుకాణానికి వెళ్లి..

తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి.. ఓ ‘స్వీట్‌’ గిఫ్ట్‌ తీసుకున్నారు.పూర్తి కథనం

5. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించనున్న సీబీఐ

మద్యం కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. భారాస ఎమ్మెల్సీ కవిత శని, ఆదివారాల్లో వారి కస్టడీలో ఉండనున్నారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం కవితను అధికారులు సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు. దిల్లీ మద్యం విధానం రూపకల్పన, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది.పూర్తి కథనం

6. నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా.. ఇరాన్‌ దాడికి ఎంతో సమయం లేదన్న బైడెన్‌

ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) దాడి చేయొచ్చన్న సంకేతాలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న నిఘా వర్గాల సమాచారం ధ్రువీకరించేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Jeo Biden) స్పందించారు.పూర్తి కథనం

7. వైకాపాకు షాక్‌.. పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే

వైకాపా (YSRCP)కు మరో షాక్‌ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్‌ను ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్‌కు వైకాపా కేటాయించింది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు నేడు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.పూర్తి కథనం

8. రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించాల్సిందే: ఆడమ్ గిల్‌క్రిస్ట్‌

లఖ్‌నవూతో నిన్న జరిగిన మ్యాచ్‌లో దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) అంపైర్‌తో స్వల్ప వాగ్వాదానికి దిగాడు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో (4వ ఓవర్‌) దేవదుత్‌ పడిక్కల్ బంతిని ఎదుర్కొన్నాడు. లెగ్‌సైడ్‌ వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌గా సిగ్నల్‌ ఇచ్చాడు. పంత్ వెంటనే రివ్యూ కోసం అడిగినట్లు కనిపించింది.పూర్తి కథనం

9. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎయిరిండియా కీలక నిర్ణయం..!

డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) విరుచుకుపడుతుందన్న అంచనాలు పశ్చిమాసియాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం.పూర్తి కథనం

10. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి తీరుపై అభ్యర్థుల్లో అసహనం..!

తెలంగాణలో భాజపాకు (BJP) లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో కమలం పార్టీ విఫలమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వైఖరేనని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. అధ్యక్షుడి హోదాలో రాష్ట్రమంతా తిరగాల్సిన కిషన్‌రెడ్డి (Kishan Reddy) కేవలం సికింద్రాబాద్‌కే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని