Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Apr 2024 13:10 IST

]

1. గులకరాయి డ్రామా.. జగన్‌లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు

సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలు పాల్జేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో తెదేపాకు సంబంధం ఏమిటని, తమపై నెట్టడానికి సిగ్గనిపించడం లేదా అని ఆ్రగహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం

2. అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు.పూర్తి కథనం

3. భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్‌

శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మిథిలా మైదానంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.పూర్తి కథనం

4. శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్‌పేట్‌ సీతారాంబాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వెయ్యి మంది పోలీసులతో భద్రత కల్పించారు. పూర్తి కథనం

5. రాయి దాడి కేసు.. బొండా ఉమాను ఇరికించే ప్రయత్నంలో వైకాపా: కేశినేని చిన్ని

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి కథనం

6. సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిపోదామన్న ఆతృతతో కొంత మంది చేస్తున్న పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇతరుల ప్రాణాల మీదకూ తెస్తున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఏమాత్రం అవగాహనలేని విషయాలపై సాధికారికంగా మాట్లాడుతూ ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువై పోతోంది.పూర్తి కథనం

7. ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?

భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా (USA) మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోదీ (Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.పూర్తి కథనం

8. మా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్‌ నిర్ణయం: అమెరికా

అమెరికా (USA) రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్‌ తన మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక అధికారి తెలిపారు. కొన్ని డబ్ల్యూటీఓ వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని వెల్లడించారు.పూర్తి కథనం

9. క్రీజ్‌లో బట్లర్.. చివరి ఓవర్‌ను వరుణ్‌కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్

తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 223/6 స్కోరు చేసింది. సునీల్ నరైన్ (109) సెంచరీ సాధించాడు. అనంతరం రాజస్థాన్‌ బ్యాటర్ జోస్ బట్లర్ (107*) చెలరేగడంతో సరిగ్గా 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివరి ఓవర్‌లో కేవలం 9 పరుగులు అవసరమైన వేళ అనూహ్యంగా స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తికి కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ బంతినిచ్చాడు. పూర్తి కథనం

10. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

తిరుమల శ్రీవారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు (PV Sindhu) దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సింధు కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని