Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Apr 2024 12:59 IST

1. అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు

జగన్‌ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు. ఏపీలోని ప్రతి రైతు కుటుంబం నెత్తిన రూ.2.45 లక్షలకు పైగా అప్పు ఉందని చెప్పారు. పూర్తి కథనం

2. ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్‌నాథ్‌ సూచన

‘‘మీకు కుమారుడికి ఓటేయకపోయినా.. కనీసం అతడిని ఆశీర్వదించండి’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ (AK Antony)ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) కోరారు. ఆంటోనీ కుమారుడు అనిల్‌ (Anil Antony) భాజపా టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.పూర్తి కథనం

3. భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్‌బై!

భారాసకు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపో అనుచరులతో కలిసి చేరతానని చెప్పారు. పూర్తి కథనం

4. నూతన నావికాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి

నూతన నావికాదళాధిపతిగా (Navy Chief) వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కుమార్‌ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం త్రిపాఠి (Dinesh Kumar Tripathi) భారత నావికాదళ వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.పూర్తి కథనం

5. గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్‌ట్యాంక్‌ నుంచి మెహదీపట్నం, నానల్‌ నగర్‌, లంగర్‌హౌస్‌, సన్‌సిటీ, అప్పా జంక్షన్‌ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.పూర్తి కథనం

6. పుత్తూరులో భారీ మద్యం డంప్‌ స్వాధీనం

తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి రోజా అనుచరుడు, వైకాపా నేత ఉమామహేశ్వరావుకు చెందిన శ్రీవిద్య కళాశాలలో కళాశాలలో 250 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. ఒక్కో కేసులో 48 బాటిళ్లు ఉన్నట్లు సమాచారం.పూర్తి కథనం

7. మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్‌

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. అన్నివర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేశారని ఆరోపించారు.పూర్తి కథనం

8. ‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఘర్షణ వేళ మస్క్‌ పోస్ట్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల వేళ ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘మనమంతా రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని.. అంతరిక్షంలోకి పంపించాలి’’ అంటూ శాంతియుత పరిస్థితులకు ఆయన పిలుపునిచ్చారు.పూర్తి కథనం

9. డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్‌.. ‘నో కామెంట్స్‌’ అంటున్న ఇజ్రాయెల్‌

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ (Iram)లో శుక్రవారం తెల్లవారుజామున పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇవి ఇజ్రాయెల్‌ (Israel) ప్రతీకార దాడులేనని అమెరికా చెబుతోంది. అయితే వీటిని ధ్రువీకరించేందుకు మాత్రం ఇజ్రాయెల్‌ నిరాకరించింది. పూర్తి కథనం

10. పవర్‌ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్‌ప్రీత్ బుమ్రా

పంజాబ్‌పై నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చిన ముంబయి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లను పడగొట్టాడు. అతడు వేసిన తొలి ఓవర్‌లోనే సామ్‌ కరన్, రిలీ రొసోవ్‌ను ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో అతడు తొలిసారి పవర్‌ ప్లేలో రెండు ఓవర్లు వేయడం గమనార్హం. బుమ్రాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు