పుత్తూరులో భారీ మద్యం డంప్‌ స్వాధీనం

తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్‌ చేసినట్లు గుర్తించారు.

Updated : 19 Apr 2024 11:25 IST

పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి రోజా అనుచరుడు, వైకాపా నేత ఉమామహేశ్వరావుకు చెందిన శ్రీవిద్య కళాశాలలో కళాశాలలో 250 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. ఒక్కో కేసులో 48 బాటిళ్లు ఉన్నట్లు సమాచారం. నగరిలో మంత్రి రోజా నామినేషన్‌ నేపథ్యంలో ఇది బయటపడటం గమనార్హం.

గురువారం పోలీసులు పుత్తూరు బైపాస్‌ గోవిందపాలెం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఆటోలో మద్యం తరలిస్తూ పుత్తూరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ శంకర్‌ బంధువు, కాంట్రాక్టర్‌ తిరునావుక్కరసు పట్టుబడ్డాడు. ఆయన్ను విచారిచంగా శ్రీవిద్య కళాశాల నుంచి తీసుకెళ్తున్నట్లు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు కాలేజీపై దాడి చేసి 250 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు లేకుండా చేసేందుకు మంత్రి రోజా రాత్రి నుంచి పోలీసులపై తీవ్రఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం తిరునావుక్కరసు, ఉమా మహేశ్వరరావు, మరో వైకాపా నేత వంశీకృష్ణ నారాయణవనం పోలీసుల అదుపులో ఉండగా.. ఇంకా కేసు నమోదు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని