Top Ten News @ 1 pM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 pM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 May 2024 12:59 IST

1. పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు

పోలింగ్‌ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడు జిల్లాలో ఓటింగ్‌ అంతా తెదేపా కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఎస్పీకి, మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారు.  పూర్తి కథనం

2. ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్‌మెంట్‌పై చెన్నై ఫ్రాంచైజీ!

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. కీలక మ్యాచ్‌లో సీఎస్కేపై బెంగళూరు విజయం సాధించడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) దూకుడుగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ సీజన్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావిస్తున్నప్పటికీ.. ధోనీ మాత్రం ఇంకా స్పందించలేదు.  పూర్తి కథనం

3. కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది. పూర్తి కథనం

4. పీఎఫ్‌ విత్‌డ్రా.. ఈ క్లెయిమ్స్‌పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలో జమ చేసిన మొత్తం పదవీ విరమణ కోసమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం.. ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో వైద్య ఖర్చుల కోసం చేసే ఆటోక్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌లో తాజాగా ఈపీఎఫ్‌ఓ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రూల్‌ 68జె కింద ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది.పూర్తి కథనం

5. హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Iran President Ebrahim Raisi) హఠాన్మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన (Helicopter Crash) సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్‌లో ఉన్నవారంతా దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది.పూర్తి కథనం

6. ప్రారంభమైన ‘టెట్‌’ ఎగ్జామ్‌.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. పరీక్ష నేపథ్యంలో అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జూన్‌ 2 వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్‌కు 99,958 మంది, రెండో పేపర్‌కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి కథనం

7.సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు

ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చివరి ఓవర్‌లో 18 పరుగులు చేస్తే చెన్నై నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఆర్సీబీ బౌలర్ యశ్‌ దయాళ్ ఏడు పరుగులే ఇచ్చి ఎంఎస్ ధోనీ (MS Dhoni) వికెట్‌ను తీశాడు. దీంతో సంబరాల్లో మునిగిపోయిన బెంగళూరు ఆటగాళ్లు.. చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకూ కాస్త సమయం తీసుకున్నారు. పూర్తి కథనం

8.శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు

శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్‌ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతో పాటు అదనంగా వచ్చే వారికి టికెట్‌ రేటు పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా అభిషేకం టికెట్‌ ధర రూ.1500. దంపతులతోపాటు అదనంగా వచ్చే వారికి రూ.500 చొప్పున మరో టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రాత్రి నుంచి ఈ అదనపు టికెట్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. పూర్తి కథనం

9. ‘మిరాయ్‌’ ‘ది బ్లాక్‌ స్వర్డ్‌’ గ్లింప్స్‌.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ వారియర్‌ లుక్‌!

మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్‌ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్‌’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్‌ స్వర్డ్‌’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.పూర్తి కథనం

10. ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. ఆ లింకులపై క్లిక్‌ చేయొద్దు..!

‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ రివార్డ్స్‌ పేరిట ఈ మధ్య వాట్సప్‌ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరికి సాధారణ ఎసెమ్మెస్‌ల రూపంలోనూ మోసపూరిత లింకులు వస్తున్నాయి. వాటిపై క్లిక్‌ చేసి పలువురు నష్టపోయిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని